అఫిషియల్‌ : పుష్ప ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..!

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది.డిసెంబర్ 6 వ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుష్ప సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటించారు.

 Allu Arjun And Sukumar Movie Pushpa Movie Trailer Release Date,latest News-TeluguStop.com

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా హ్యాట్రిక్ ఖాయమంటూ అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఏకంగా 150 కోట్ల బడ్జెట్తో సినిమాను రూపొందించినట్లు గా చెప్తున్నారు.

అల్లు అర్జున్ కు జోడిగా ఈ సినిమాలో రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే.ఆమె ఈ సినిమాలో డి గ్లామర్ గా కనిపించింది.

సునీల్ మరియు అనుసూయ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమాలో సూపర్ విలన్ గా మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కనిపించబోతున్నాడు.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Trailer-Movie

డిసెంబర్ 17వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ ఆరో తారీఖున రాబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు భారీ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.ముంబైలో ప్రముఖ స్టార్స్ తో కలిపి పుష్ప ప్రమోషన్ ను నిర్వహించబోతున్నారు.అలాగే బిగ్బాస్ స్టేజిపై కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి అల్లు అర్జున్ భారీ ఎత్తున విడుదల అవ్వడానికి డిసెంబర్ ఆరో తారీఖున రాబోతున్న ట్రైలర్ రేంజ్ లో దోహద పడుతుందో చూడాలి.గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురం లో సినిమా తర్వాత బన్నీ నటించిన సినిమా పై దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న విషయం వచ్చింది.

అందుకే పుష్ప సినిమా కచ్చితంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందనే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.మరి సుకుమార్ ఆ మార్క్ ను క్రాస్ చేసి అల్లు అర్జున్ కు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చి పెడతాడా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube