లారీ డ్రైవర్ గా స్టైలిష్ స్టార్... అయ్యే పనేనా...

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్యాలిక్యులేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

 Allu Arjun And Sukumar Movie Latest Update-TeluguStop.com

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ గురించి ప్రస్తుతం కొన్ని వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నటువంటి అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని పలు వార్తలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.అంతేగాక ఇప్పటికే అల్లు అర్జున్ కూడా 10 చక్రాల లారీని  నడిపే శిక్షను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

 Allu Arjun And Sukumar Movie Latest Update-లారీ డ్రైవర్ గా స్టైలిష్ స్టార్… అయ్యే పనేనా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ చిత్రం ఓ ఎర్రచందనం స్మగ్లింగ్ అనే ట్యాగ్ లైన్ చుట్టూ తిరుగుతుందని ఇందులో ముఖ్యంగా లారీతో చేంజ్ చేసే సన్నివేశాలు కీలకమని అందువల్లనే అల్లుఅర్జున్ లారీ నడపడంలో శిక్షణ తీసుకుంటున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు.అంతేకాక ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.

మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది.అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై వస్తున్నటువంటి ఈ వార్తల గురించి దర్శకుడు సుకుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాక ఇతర దేశాల్లో పలు నాన్ బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టింది.దీంతో ఇదే ఊపులో బన్నీ తన తదుపరి చిత్రాన్ని కూడా విడుదల చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 

#StylishStar #StylishStar #StylishStar #StylishStar #StylishStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు