క్యూట్ లవ్ స్టోరీ : అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ఎక్కడ చూసి పడిపోయాడో తెలుసా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఏ హీరో ప్రత్యేకత ఆ హీరోది.ఇప్పుడున్న హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఉండగా.

 Allu Arjun And Sneha Reddy Love Story-TeluguStop.com

ఎవరి స్టైల్ వాళ్లది కాగా ఎంతమంది అగ్ర హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో నలుగురు అగ్ర హీరోలు ఉన్నారంటే చిన్న విషయం కాదు.అందులో చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150 తో వచ్చి, సైరా తో మనందరినీ అలరించి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య గా వస్తున్నారు.

అలాగే మెగా ఫ్యామిలీ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత హిందీ సినిమా అయిన పింక్ రీమేక్ తెలుగులో వకిల్ సాబ్ గా మళ్లీ ప్రేక్షకుల్ని అలరించడానికి మన ముందుకు వస్తున్నారు.ఇవే కాకుండా తర్వాత ఒక అయిదారు సినిమాలు లైన్ లో పెట్టాడు.

 Allu Arjun And Sneha Reddy Love Story-క్యూట్ లవ్ స్టోరీ : అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ఎక్కడ చూసి పడిపోయాడో తెలుసా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR సినిమాతో మనందరినీ అలరించడానికి ఎన్టీఆర్ తో కలిసి మన ముందుకు రాబోతున్నారు.

అయితే మెగా ఫ్యామిలీ లో ఎంత మంది ఉన్నా స్టైలిష్ స్టార్ గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి మాత్రం చాలా గొప్పగానే చెప్పుకోవాలి.

ఎందుకంటే తను పెద్దగా చదువుకోలేదు అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా మెగాస్టార్ డాడీ సినిమాలో డాన్సర్ గా ఓ మంచి క్యారెక్టర్ చేశాడు.దాని తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందో చిత్రంగా గంగోత్రి సినిమా అల్లు అర్జున్ నీ హీరోగా పెట్టి తెరకెక్కించాడు.

అయినప్పటికీ అల్లు అర్జున్ కి పెద్దగా క్రేజ్ రాలేదు.దాంతో చేసేది లేక సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన ఆర్య సినిమాలో యాక్టింగ్ తో పాటు డ్యాన్సులు, ఫైట్లు ఇరగదీశాడు బన్నీ ఆ తర్వాత బన్నీ దేశముదురు జులాయి రేసుగుర్రం లాంటి సినిమాలతో అగ్ర హీరో అయిపోయాడు.

రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠ పురం లో సినిమాతో తను ఏ హీరో కంటే తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు.అయితే బన్నీ టెన్త్ వరకే చదివి ఆపేసాడు ఒక రోజు జరిగిన ఫంక్షన్ లో స్నేహలత రెడ్డి ని చూసి లవ్ చేసాడు.

స్నేహ హైదరాబాద్ లోనే డిగ్రీ పూర్తిచేసి అమెరికాలో ఎమ్మెస్ చేసింది స్వతహాగా వీళ్ళ నాన్న కి కొన్ని కాలేజీలు ఉన్నాయి.అమెరికాలో ఎమ్మెస్ అయిపోయిన తర్వాత ఇక్కడకొచ్చి వాళ్ళ కాలేజీ కి సంబంధించిన పనులు చూసుకుంది.

అలా బన్నీ తో పరిచయం ఏర్పడిన తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్నారు బన్నీ పెద్దగా చదువుకోలేదు.అయితే అటు స్నేహ ఇంట్లో వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు.ఇటు అల్లు అరవింద్ కూడా వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ మొత్తానికి బన్నీ స్నేహ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకు అయాన్ కూతురు అర్హ… కొడుకు అయాన్, కూతురు అర్హలకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో బన్నీ తెలియజేస్తూ ఉంటాడు.

అర్హ అయితే బన్నీ నీ తిడుతూ ఉండగా తీసిన వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు బన్నీ.

Telugu Allu Arjun, Allu Ayan, Bunny, Sneha Reddy, Stylish Star, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో హీరోగా చేస్తున్నారు.దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతుంది.అయితే టాలీవుడ్ హీరోల్లో ఎంత మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న బన్నీ, స్నేహలత రెడ్డిల ప్రేమ పెళ్లి కి ఉన్న ప్రత్యేకతే వేరు.

టాలీవుడ్ లో హీరోయిన్ ని సినిమాల్లో ఎక్కువగా రిపీట్ చేయడానికి ఇష్టపడని హీరో అల్లు అర్జున్.ఒక్క పూజా హెగ్డే మాత్రం దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్ గా నటించింది మళ్లీ ఆ తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో అల వైకుంఠపురం లో సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది బన్నీ రిపీటెడ్ హీరోయిన్స్ ని పెద్దగా తీసుకోడు.

అల్లు అర్జున్ కి తెలుగు తో పాటు మలయాళం లో కూడా మంచి మార్కెట్ ఉంది అక్కడ అతన్ని అల్లు అర్జున్ అని పిలవరు మల్లు అర్జున్ అని పిలుస్తారు.బన్నీ సినిమా రిలీజవుతుందంటే అక్కడ ఉండే పెద్ద స్టార్ హీరోలు కూడా వాళ్ల సినిమాని వాయిదా వేసుకుంటారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల దాకా రెమ్యున్ రేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది.సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీ గా వస్తుంది.

ఇది కనుక హిట్ అయితే అల్లు అర్జున్ రెమ్యున్ రేషన్ ఇంకో పది కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది.చూద్దాం మరి పుష్ప హిట్ అవుతుందో లేదో.

#Bunny #Allu Ayan #Sneha #Stylish #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు