ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల నుండి వచ్చేసిన కొత్త వీడియోలు, ఏంటో తెలుసా?

స్టార్‌ హీరోలను వారి అభిమానులు ఇంతకు ముందు సినిమాల్లో మాత్రమే చూసే ఛాన్స్ ఉండేది.కాని ఇప్పుడు అనేక మార్గాల ద్వారా వారిని చూసే వీలు ఉంటుంది.

 Allu Arjun And Ntr New Ad Commercial Videos Out, Ad, Commercial ,ads Allu Arjun,-TeluguStop.com

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వారు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.ఇక కొందరు హీరోలు కమర్షియల్స్ పేరుతో ఎప్పుడు కూడా టీవీల్లో కనిపిస్తూనే ఉన్నారు.

కమర్షియల్స్ విషయంలో మహేష్‌ బాబు తర్వాత మరెవ్వరు అయినా అనడంలో సందేహం లేదు.ఆయన పెద్ద ఎత్తున కమర్షియల్స్ చేస్తూనే ఉన్నాడు.

ఆయన తర్వాత అల్లు అర్జున్‌ మరియు ఎన్టీఆర్‌ లు కూడా కమర్షియల్‌ యాడ్‌ ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.వరుసగా చేస్తున్న కమర్షియల్‌ యాడ్స్ తో ఎన్టీఆర్‌ కూడా బుల్లి తెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు.

ఇక అల్లు అర్జున్ కూడా పలు బ్రాండ్‌ లను ప్రమోట్‌ చేస్తూ బుల్లి తెరపై రెగ్యులర్‌ గా కనిపిస్తూ వస్తున్నాడు.

సమ్మర్‌ సీజన్‌ ప్రారంభం అవ్వడంతో వీరిద్దరు కూడా కూల్‌ డ్రింగ్స్‌ యాడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

అల్లు అర్జున్‌ ఫ్రూటీ యాడ్‌ తో రాగా ఎన్టీఆర్‌ అప్పీ పీజ్ తో వచ్చేశాడు.వీరిద్దరు కూడా యాడ్స్ లో కొత్త లుక్‌ తో కనిపిస్తున్నారు.టీవీలు మరియు సోషల్‌ మీడియాల్లో వీరి యాడ్స్‌ ప్రస్తుతం తెగ సందడి చేస్తున్నాయి.వీరి యాడ్స్ ను ఇంకా చూడనట్లయితే వెంటనే వెళ్లి చూడండి.

ఇద్దరు కూడా తెగ హడావుడి చేస్తున్న ఆ వీడియోలు ఖచ్చితంగా అభిమానులకు పండుగ ఇస్తాయి అనడంలో సందేహం లేదు.అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

అలాగే ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్ ఆర్ సినిమా తో బిజీగా ఉన్నాడు.ఈ రెండు సినిమా లపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

మాటల మాంత్రికుడు తో ఎన్టీఆర్‌ తదుపరి సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.కొరటాల శివతో బన్నీ తదుపరి సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube