కారులో షికార్లు కొడుతున్న అల్లు అర్జున్ దంపతులు.. హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇదే!

Allu Arjun And His Family Are Enjoing In The Car And This Is Happy Family Means

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా నిలిచి ఓ రేంజ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ కు ఈ సినిమా మంచి గుర్తింపు అందించింది.

 Allu Arjun And His Family Are Enjoing In The Car And This Is Happy Family Means-TeluguStop.com

తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత బన్నీ, ఆర్య వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి స్టార్ హీరోగా మార్చాయి.

అలా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.

 Allu Arjun And His Family Are Enjoing In The Car And This Is Happy Family Means-కారులో షికార్లు కొడుతున్న అల్లు అర్జున్ దంపతులు.. హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈయన మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో 2011లో స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

తనకు సినిమా షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో లగేజ్ సర్దుకొని విదేశ ప్రయాణాలు చేస్తాడు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతూ మంచి భర్తగా, మంచి తండ్రిగా నిలిచాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహ రెడ్డి, అల్లు అర్జున్ ల జంట క్యూట్ కపుల్ గా నిలిచింది.ఇప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా కనిపిస్తుంటారు.

Telugu Allu Arha, Allu Arjun, Allu Arjun Couple Long Drive, Allu Family Trip, Allu Sneha, Car, Family, Film Industry, Happy Couple, Hero, Hyderabad, Pushpa Movie, Tollywood, Trip-Movie

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తెలుగు ప్రజలతో మంచి పరిచయాన్ని పెంచుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా కు సంబంధించిన సర్వేలో స్నేహ రెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.ఏ స్టార్ హీరోల భార్యలు, స్టార్ హీరోయిన్ లు కూడా అందుకొని గుర్తింపును సొంతం చేసుకుంది.

Telugu Allu Arha, Allu Arjun, Allu Arjun Couple Long Drive, Allu Family Trip, Allu Sneha, Car, Family, Film Industry, Happy Couple, Hero, Hyderabad, Pushpa Movie, Tollywood, Trip-Movie

తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా అప్ డేట్ లను, ఫోటోలను, పిల్లలతో సరదాగా ఆడుతున్న వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.మొత్తానికి అల్లు అర్జున్ కుటుంబం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అభిమాన కుటుంబంగా అభిమానులకు దగ్గరయింది.

ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ దంపతులు కారులో షికారులు కొడుతూ కనిపించారు.

దీనికి సంబంధించిన వీడియో స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అల్లు అర్జున్ కు షూటింగ్ లో కాస్త బ్రేక్ రావడంతో తన ఫ్యామిలీతో ట్రిప్ బిజీలో కనిపించాడు.

Telugu Allu Arha, Allu Arjun, Allu Arjun Couple Long Drive, Allu Family Trip, Allu Sneha, Car, Family, Film Industry, Happy Couple, Hero, Hyderabad, Pushpa Movie, Tollywood, Trip-Movie

హైదరాబాద్ రోడ్లపై లాంగ్ డ్రైవ్ చేస్తూ కనిపించగా అందులో తన కూతురు అర్హ, తన భార్య స్నేహ రెడ్డి ఉన్నారు.సరదాగా పాటలు వింటూ లాంగ్ డ్రైవ్ చేస్తుండగా స్నేహ రెడ్డి తమ ఆనంద క్షణాలను ఫోన్ లో వీడియో ద్వారా బంధించింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా.అల్లు అర్జున్ అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు.హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇదే అని కామెంట్లు పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

#Allu Sneha #Allu Arjun #Arjun #Family #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube