అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌ ఎప్పుడు ప్రారంభం కాబోతుందో తెలుసా?

సినిమా థియేటర్ల రంగంలో ఏషియన్‌ సంస్థ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఇటీవలే ఏషియన్ సంస్థ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో కలిసి ఏఎంబీ ని ప్రారంభించారు.

 Stylish Hero Allu Arjun And Asian Cinemas Aaa Multiplex Coming Soon , Aaa, Allu-TeluguStop.com

ఆ మల్టీ ప్లెక్స్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మహేష్‌ బాబు బ్రాండ్‌ ఇమేజ్ కలిసి వచ్చి అద్బుతంగా ఏఎంబీ రన్‌ అవుతుంది.

ఈ సమయంలోనే మరి కొన్ని మల్టీ ప్లెక్స్‌ లను కూడా ఏషియన్ సంస్థ తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.ఇప్పటికే విజయ్‌ దేవరకొండతో కలిసి ఏవీడీ మల్టీ ప్లెక్స్‌ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

వచ్చే నెలలో వకీల్‌ సాబ్‌ సినిమా తో ఏవీడీ మల్టీ ప్లెక్స్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది.ఇదే సమయంలో అల్లు అర్జున్‌ మల్టీ ప్లెక్స్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఏషియన్‌ సంస్థ వారు మరియు అల్లు అర్జున్‌ కలిసి ఏఏఏ మల్టీ ప్లెక్స్ ను తీసుకు రాబోతున్నారు.అమీర్ పేటలోని ఒక మంచి ఏరియాలో ఈ మల్టీప్లెక్స్‌ నిర్మాణం జరుగుతుంది.

ఆ మల్టీ ప్లెక్స్ ఇప్పటికే ముగింపు దశకు వచ్చిందని అంటున్నారు.అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా ప్రారంభించబోతున్నారట.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది అల్లు అర్జున్‌ ఏఏఏ మల్టీ ప్లెక్స్ అందుబాటులోకి రాబోతున్నట్లుగా చెబుతున్నారు.అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా తో ఏఏఏ మల్టీ ప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా కూడా కొన్ని టెక్నికల్‌ సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని అంటున్నారు.

సంక్రాంతికి మాత్రం ఏఏఏ మల్టీ ప్లెక్స్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. పుష్ప సినిమా లో నటిస్తున్న అల్లు అర్జున్‌ ఆగస్టులో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube