టాలీవుడ్‌లో రికార్డు కొట్టిన ఏకైక హీరో బన్నీ  

Allu Arjun Becomes The Only Hero In Tollywood, Allu Arjun, Ala Vaikunthapuramuloo, Trivikram, Thaman, Pooja Hegde - Telugu Ala Vaikunthapuramuloo, Allu Arjun, Pooja Hegde, Thaman, Trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయగా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కగా, ఈ సినిమాకు అదనపు బలంగా థమన్ అందించిన సంగీతం నిలిచింది.

 Allu Arjun Ala Vaikunthapuramuloo Trivikram

ఈ సినిమాలోని పాటలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

సామజవరగమనా పాటతో మొదలైన ఈ మ్యూజికల్ సెన్సేషన్ రాములో రాములా, బుట్ట బొమ్మా వంటి పాటలతో కంటిన్యూ అవుతూ వచ్చింది.

టాలీవుడ్‌లో రికార్డు కొట్టిన ఏకైక హీరో బన్నీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.కాగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకుంది.ఇక ఈ పాట 260 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లోనే ఎక్కువ మంది వీక్షించిన పాటగా నిలిచింది.

గతంలో ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే’ పాట క్రియేట్ చేసిన రికార్డును అధిగమించి బుట్టబొమ్మా ఈ రికార్డును సొంతం చేసుకుంది.

ఇక థమన్ అందించిన సంగీతానికి ప్రేక్షకులు పట్టం కట్టారు.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ టేకింగ్, థమన్ సంగీతం కలగలిసి ఈ సినిమాకు స్టన్నింగ్ రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

#Pooja Hegde #Allu Arjun #Trivikram #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Ala Vaikunthapuramuloo Trivikram Related Telugu News,Photos/Pics,Images..