రామ్ చరణ్ ని టార్గెట్ చేసిన స్టైలిష్ స్టార్ ఎందుకో తెలుసా...?  

Is Allu Arjun Target To Ram Charan In Usa-ala Vaikuntapuramulo News,allu Arjun,allu Arjun Ala Vaikuntapuramulo,allu Arjun News,rabgasthalam,ram Charan

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన టువంటి చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.

Is Allu Arjun Target To Ram Charan In Usa-Ala Vaikuntapuramulo News Allu Ala Rabgasthalam

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటించారు.అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, జయరామ్, సునీల్, మురళీ శర్మ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్లలో దూసుకుపోతోంది.అయితే ఇప్పటికే ఇతర దేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినటువంటి బన్నీ ఈసారి రామ్ చరణ్ నటించినటువంటి రంగస్థలం చిత్ర రికార్డులపై కన్నేసాడు.

ఇప్పటికే యూస్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం రికార్డులను బద్దలు కొట్టి రంగస్థలం వసూళ్ల రికార్డును అందుకునేందుకు చేరువలో ఉన్నాడు.అయితే రంగస్థలం చిత్రం గతంలో 3.4 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా బన్నీ ఇప్పటికే 3.2 మిలియన్లు సాధించి మరింత చేరువగా వెళుతున్నాడు.

ప్రస్తుతం యుఎస్ లో వసూలు అవుతున్న కలెక్షన్ల జోరు చూస్తుంటే ఇంకో రెండు రోజుల్లో చెర్రీ రికార్డు కూడా బద్దలవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వంద కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టి బన్నీ కెరీర్లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది అల వైకుంఠపురంలో.

తాజా వార్తలు

Is Allu Arjun Target To Ram Charan In Usa-ala Vaikuntapuramulo News,allu Arjun,allu Arjun Ala Vaikuntapuramulo,allu Arjun News,rabgasthalam,ram Charan Related....