కడుపులో ఉన్న బిడ్డను కూడా కదిలించిన అల్లు అర్జున్‌ పాట  

Allu Arjun Ala Vaikuntapuramlo S Goes On Viral - Telugu Ala Vaikuntapuramlo S, Allu Arjun, Butta Bomma , Pregnent Lady Baby Dance On Butta Bomma S, Shilpa Shetty Dance On Butta Bomma

అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌గా నిలిచిన విషయం తెల్సిందే.అద్బుతమైన విజయంతో బన్నీ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టాడు.

Allu Arjun Ala Vaikuntapuramlo Songs Goes On Viral

సినిమా మాత్రమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి.ఇవి బాహుబలి రికార్డును కూడా బ్రేక్‌ చేశాయి.

యూట్యూబ్‌లో ఈ సినిమా పాటలు ఏ రేంజ్‌లో ఊపేస్తున్నాయో వందల మిలియన్‌ల వ్యూస్‌ను చూస్తుంటే తెలుస్తుంది.

చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటలను ప్రస్తుతం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.ఇటీవలే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శిల్ప శెట్టి ఏకంగా బుట్టబొమ్మ పాటకు టిక్‌టాక్‌ వీడియో చేయడంతో అది ఏ స్థాయిలో వైరల్‌ అయ్యిందో చెప్పనక్కర్లేదు.ఇక తాజాగా ట్విట్టర్‌లో ఒక వీడియో వైరల్‌ అవుతోంది.

బుట్టబొమ్మ పాట టీవీలో వస్తున్న సమయంలో గర్బవతిగా ఉన్న ఒక మహిళ వింటూ ఉంది.ఆ సమయంలోనే తన కడుపులోని బేబీ ఆ పాటకు స్పందించినట్లుగా ఆమె చెప్పింది.అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్‌ చేసింది.ఎనిమిది నెలల గర్బవతి అయిన ఆమె తన బేబీ బుట్టబొమ్మకు రెస్పాండ్‌ అయినట్లుగా చెప్పడంతో ప్రస్తుతం అది కాస్త వైరల్‌ అయ్యింది.

తాజా వార్తలు