అల్లు అర్జున్‌ మరోసారి అక్కడ రికార్డు బద్దలు కొట్టాడు  

Allu Arjun Ala Vaikuntapuramlo Malayalam Allu Arjun Fans Mohan Lall Mammooti Pooja Hegde - Telugu Ala Vaikuntapuramlo, Allu Arjun, Allu Arjun Fans, Malayalam, Mammooti, Mohan Lall, Pooja Hegde

కేరళలో అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బన్నీ నటించిన ప్రతి సినిమా కూడా కేరళలో విడుదల అవుతుంది.

 Allu Arjun Ala Vaikuntapuramlo Malayalam Allu Arjun Fans Mohan Lall Mammooti Pooja Hegde

మలయాళంలో డబ్‌ అయ్యే బన్నీ సినిమాలు దాదాపు అన్ని కూడా మంచి వసూళ్లను నమోదు చేస్తూ ఉంటాయి.మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ సినిమాల స్థాయిలో బన్నీ సినిమాలు వసూళ్లు నమోదు చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

కొన్ని సార్లు అక్కడి స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ ఈయన సినిమాలు ఆడాయి.

అల్లు అర్జున్‌ మరోసారి అక్కడ రికార్డు బద్దలు కొట్టాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సంక్రాంతికి తెలుగులో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం మలయాళంలో అంగు వైకుంఠపురుతు గా డబ్‌ అయ్యింది.అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది.తాజాగా అక్కడ బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.లాక్‌ డౌన్‌ కారణంగా అంతా ఇంట్లోనే ఉండటం వల్లో లేక బన్నీకి మామూలుగానే ఉన్న క్రేజ్‌ కారణం వల్లో కాని కేరళ రాష్ట్రంలో ఏకంగా 11.17 టీఆర్పీని దక్కించుకుంది.మలయాళ సినిమాలు సైతం ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవాలంటే చాలా స్టఫ్‌ ఉండాలి.

సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, మమ్ముట్టిలకే సాధ్యం అయిన ఈ రికార్డును బన్నీ దక్కించుకోవడం నిజంగా అద్బుతం అంటున్నారు.

అక్కడ ఈ దెబ్బతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరింతగా పెరగడం ఖాయం.కేరళలో తనకున్న స్టార్‌డంను చూసుకుని బన్నీ ఆనందంతో పరవశించి పోతూ ఉంటాడు.అందుకే మలయాళీల కోసం ఒక మలయాళి సినిమా చేస్తానంటూ ఆమద్య ప్రకటించాడు.త్వరలోనే బన్నీ ఆ సినిమా చేస్తాడేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు