అరుదైన రికార్డుకు కొద్ది దూరంలో ఉన్న బన్నీ  

The Bunny Is Just A Short Distance Away From The Record - Telugu Ala Vaikunta Puramulo, Allu Arjun, Bunny Record, Tollywood Box Office, Tollywood Gossips, బన్నీ

అల్లు అర్జున్‌ చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న మూమెంట్‌ వచ్చేసింది.అల వైకుంఠపురంలో చిత్రంతో నాన్‌ బాహుబలి రికార్డును మనోడు దక్కించుకునే సమయం రానే వచ్చింది.ఇన్నాళ్లు ఓవర్సీస్‌లో కనీసం 1.5 మిలియన్‌ డార్లను కూడా దక్కించుకోలేక పోయిన బన్నీ ఈసారి ఏకంగా టాప్‌ 3లో స్థానం దక్కించుకోబోతున్నాడు.ఓవర్సీస్‌ టాప్‌ 20 జాబితాలో కూడా ఇన్నాళ్లు బన్నీ సినిమా ఒక్కటి కూడా లేదు.కాని అల వైకుంఠపురంలో చిత్రం మూడు మిలియన్‌ల డాలర్లను వసూళ్లు చేయడంతో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది.

The Bunny Is Just A Short Distance Away From The Record

ప్రస్తుతం అల వైకుంఠపురంలో చిత్రం ముందు బాహుబలి రెండు పార్ట్‌లు మరియు రంగస్థలం మరియు భరత్‌ అనే నేను చిత్రాలు ఉన్నాయి.బాహుబలి రికార్డును ఎలాగూ క్రాస్‌ చేయడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు.

కాని మరో వీకెండ్‌ పూర్తి అయ్యే వరకు అల వైకుంఠపురంలో చిత్రం భరత్‌ అనే నేను మరియు రంగస్థలం చిత్రాల వసూళ్లను క్రాస్‌ చేసే అవకాశం కనిపిస్తుంది.భరత్‌ అనే నేను 3.4 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయగా, రంగస్థలం 3.51 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసి మూడు నాల్గవ స్థానంలో ఉన్నాయి.

అల వైకుంఠపురంలో చిత్రం ఇంకో హాఫ్‌ మిలియన్‌ అంటే అయిదు లక్షల డాలర్లను వసూళ్లు చేస్తే నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం.ఇన్నాళ్లు టాప్‌ 20 లో కూడా లేని హీరో ఇప్పుడు ఏకంగా టాప్‌ 3 లో చోటును దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.అద్బుతమైన ఈ రికార్డును బన్నీ మరో రెండు మూడు రోజుల్లో దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ ఆ రికార్డు దక్కకున్నా కూడా టాప్‌ 5 లో ప్లేస్‌ దక్కడం అంటే నిజంగా బన్నీ కెరీర్‌ బెస్ట్‌ అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు

The Bunny Is Just A Short Distance Away From The Record-allu Arjun,bunny Record,tollywood Box Office,tollywood Gossips,బన్నీ Related....