అల్లు అర్జున్‌ నాల్గవది కూడా లైన్‌లో పెట్టాడా?  

Allu Arjun Act In Boyapati Srinu-

అల్లు అర్జున్‌ గత ఏడాది ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్న అల్లు అర్జున్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.ఆ సినిమా మిగిల్చిన నిరాశ నుండి బయట పడేందుకు దాదాపు సంవత్సరం తీసుకున్నాడు.ఎన్నో కథలు విని, ఎంతో మంది దర్శకులను పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్‌ ఎట్టకేలకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు...

Allu Arjun Act In Boyapati Srinu--Allu Arjun Act In Boyapati Srinu-

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Allu Arjun Act In Boyapati Srinu--Allu Arjun Act In Boyapati Srinu-

2019 సంవత్సరంలో అల్లు అర్జున్‌ నుండి ఒక్క సినిమా కూడా రావడం లేదు.అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ మూవీనే కాకుండా సుకుమార్‌ దర్శకత్వంలో ఒక మూవీని చేసేందుకు మరియు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఈ రెండు సినిమాలు ఎప్పుడు ప్రారంభం అయ్యేది, ఏది ముందు ప్రారంభం అయ్యే విషయంలో క్లారిటీ లేదు.

తాజాగా అల్లు అర్జున్‌ మరో సినిమాకు కూడా కమిట్‌ అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది..

సరైనోడు వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు బన్నీ మళ్లీ ఓకే చెప్పాడు.వినయ విధేయ రామ చిత్రం తర్వాత ఈయన దర్శకత్వంలో సినిమా అంటేనే హీరోలు భయపడుతుంటే బన్నీ మాత్రం తన సొంత బ్యానర్‌ అయిన గీతా ఆర్ట్స్‌లో ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

అయితే 2020 చివర్లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి బన్నీ నాలుగు లైన్‌లో పెట్టాడు.