జాతిరత్నాలు కు అల్లు అర్జున్‌ ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా?

నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన జాతి రత్నాలు సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్‌ కామెడీ ఎంటర్ టైనర్‌ గా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రేక్షకుల వరకు అంతా అంటున్నారు.

 Allu Arjun About Naveen Polishetty Movie Jathi Ratnalu , Allu Arjun, Jathi Ratna-TeluguStop.com

దాంతో ఈ సినిమా కు మంచి వసూళ్లు అయితే నమోదు అవుతున్నాయి.ఈ సమయంలోనే ఈ సినిమా కు సినీ ప్రముఖులు చేసిన ట్వీట్స్ అదనపు బలంగా నిలుస్తున్నాయి.

సినిమా నిన్న విడుదల అయ్యిందో లేదో అప్పుడే జాతి రత్నాలు సినిమా ను అల్లు అర్జున్‌ చూసేసి సినిమా పై తన స్పందన తెలియజేశాడు.ఈ సినిమా రేంజ్ ను మరింత పెంచేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నవీన్‌ పొలిశెట్టి ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్‌ కు అల్లు అర్జున్‌ ఫిదా అయ్యాడు.దర్శకుడు అనుదీప్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.

మూడు ట్వీట్స్ ను ఈ సినిమా కోసం చేసిన అల్లు అర్జున్‌ అందరిని అభినందనల్లో ముంచెత్తాడు.

జాతి రత్నాలు సినిమా ను బ్రెయిన్‌ స్విచ్చాఫ్ చేసి చూసి ఎంజాయ్‌ చేయండి అంటూ బన్నీ సలహా ఇచ్చాడు.

ఒక కొత్త తరహా నటనను నవీన్ చూపించాడు అంటూ బన్నీ కితాబు ఇచ్చాడు.కమెడియన్‌ గా చేసిన రాహుల్‌ రామకృష్ణ మరియు ప్రియదర్శిలపై కూడా బన్నీ ప్రశంసలు కురిపించాడు.

నిర్మాతలు ఇలాంటి ఒక స్క్రిప్ట్‌ ను నమ్మకంగా తీసుకోవడం అంటే ఛాలెంజింగ్ విషయం.ఈ పని చేసిన నిర్మాతలకు అభినందనలు.ఇక దర్శకుడు అనుదీప్ ఈ మొత్తం సినిమా ను ఎంటర్ టైన్‌ మెంట్‌ తో నడిపించి ఆకట్టుకున్నాడు.గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్‌ సినిమా ను నేను అయితే చూడలేదు అంటూ అతి పెద్ద కాంప్లిమెంట్‌ ను బన్నీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube