బన్నీ కూతురు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అల్లు అర్హ చేసే అల్లరికి సంబంధించిన వీడియోలను గతంలో బన్నీ స్నేహ చాలా సందర్భాల్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

 Allu Arha Reveals Her Favoruite Actress Details , Allu Arha, Bunny Daughter, Fav-TeluguStop.com

అల్లు అర్హకు సంబంధించిన క్యూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇంట్లోనే స్టార్ హీరో ఉన్నారు కాబట్టి అల్లు అర్హ అల్లు అర్జున్ నే ఫేవరెట్ హీరో అని చెబుతారు.

మరి అల్లు అర్హ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు.? అనే ప్రశ్నకు అర్హనే ఒక వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు.అల్లు అర్హ ఫేవరెట్ హీరో గురించి చెప్పిన వీడియోను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.మొదట నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ఒక అబ్బాయి గొంతుతో ప్రశ్న రాగా అల్లు అర్హ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు చెబుతూ డబ్ స్మాష్ లో ఎక్స్ ప్రెషన్లు ఇస్తారు.

అయితే స్పెల్లింగ్ చెప్పమని మళ్లీ ప్రశ్న ఎదురు కాగా అలియా భట్ పేరును అల్లు అర్హ చెబుతారు.

అల్లు అర్హ తన గొంతుతో డైరెక్ట్ గా చెప్పకపోయినా అలియా భట్ తన ఫేవరెట్ హీరోయిన్ అంటూ డబ్ స్మాష్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.భవిష్యత్తులో అల్లు అర్జున్ అలియా భట్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందేమో చూడాల్సి ఉంది.స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైకులు వస్తుండటం గమనార్హం.

భవిష్యత్తులో అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

స్టార్ హీరోల కిడ్ కావడంతో చిన్నతనంలోనే అల్లు అర్హ ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం పుష్ప షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో, వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలలో ఏ సినిమా ముందు మొదలవుతుందో అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube