ఇచ్చిన మాట కోసం బోయపాటితో అల్లు పెద్ద సాహసం  

Allu Aravindh Make A Film Boyapati Srinu Directions -

వినయ విధేయ రామ చిత్రంకు ముందు వరకు బోయపాటి శ్రీను టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌.ఈయన పలు చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ను అందుకున్నాడు.

Allu Aravindh Make A Film Boyapati Srinu Directions

అయితే వినయ విధేయ రామ చిత్రం ఆ సక్సెస్‌లన్నింటిని కూడా పాతర పెట్టేలా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.మరీ ఇంత దారుణంగా సినిమా ఫ్లాప్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఆ చిత్రం డిజాస్టర్‌ అవ్వడంతో బోయపాటికి అసలు అవకాశాలు లేకుండా పోయాయి.

ఇచ్చిన మాట కోసం బోయపాటితో అల్లు పెద్ద సాహసం-Movie-Telugu Tollywood Photo Image

బాలకృష్ణతో ఒక సినిమా చేయాల్సి ఉన్నా కూడా వినయ విధేయ రామ ఫలితం కారణంగా ఆ సినిమా ప్రస్తుతానికి క్యాన్సిల్‌ అయ్యింది.ఇక బోయపాటితో ఒక సినిమాను నిర్మించేందుకు అల్లు అరవింద్‌ గతంలోనే అడ్వాన్స్‌ ఇవ్వడం జరిగింది.సరైనోడు చిత్రం సమయంలో చిరంజీవి, బోయపాటిల కాంబోలో మూవీని చేసేందుకు అల్లు అరవింద్‌ ప్రయత్నాలు చేశాడు.

అయితే అందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అప్పట్లోనే టాక్‌ వచ్చింది.

ఇప్పుడు చిరంజీవితో కాదు కాని బోయపాటితో ఒక సినిమాను నిర్మించేందుకు అల్లు అరవింద్‌ సిద్దం అయ్యాడు.బోయపాటికి గతంలో ఇచ్చిన అడ్వాన్స్‌ ఉన్న కారణంగా అల్లు అరవింద్‌ ఈ చిత్రంను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.ఒక మంచి కథను తయారు చేయాల్సిందిగా బోయపాటికి మెగా నిర్మాత సూచించాడు.

త్వరలోనే ఆ సినిమా కథను సిద్దం చేయనున్నాడు.యువ హీరోతో బోయపాటి మూవీ ఉంటుంది.

ఆ యువ హీరో ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అయితే బోయపాటితో ప్రస్తుతం సినిమా అనేది పెద్ద సాహసం అని, ఆ సాహసంను మెగా నిర్మాత చేస్తూ తప్పు చేస్తున్నాడంటూ టాక్‌ వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు