ఆహా కోసం త్రివిక్రమ్‌ను కాకా పడుతున్న అల్లు అరవింద్‌  

Allu Aravindh Aha Trivikram - Telugu Aha, Allu Aravindh, Allu Aravindh Plan To Web Series With Trivikram, Star Heros Cinimas Streeming

అల్లు అరవింద్‌ ప్రారంభించిన ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆశించిన స్థాయిలో దూసుకు పోలేక పోతుంది.కేవలం తెలుగు మాత్రమే అవ్వడంతో పాటు స్టార్‌ హీరోల సినిమాలను ఇందులో స్ట్రీమింగ్‌కు ఉంచక పోవడం ఇంకా వెబ్‌ సిరీస్‌ల విషయంలో శ్రద్ద చూపక పోవడం వంటి కారణా వల్ల ఆహాను ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు.

 Allu Aravindh Aha Trivikram - Telugu Plan To Web Series With Star Heros Cinimas Streeming

దాంతో అల్లు అరవింద్‌ ఆహాపై ఫోకస్‌ పెట్టాడు.బన్నీతో యాడ్‌ను తయారు చేయించడంతో పాటు వెబ్‌ సిరీస్‌ల విషయంలో మరింత శ్రద్ద తీసుకుంటున్నాడు.

ప్రముఖ నిర్మాతలు ఇంకా దర్శకులతో ఒప్పందాలు కుదుర్చుకుని వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌తో ఒక వెబ్‌ సిరీస్‌ను చేయించాలనే ఉద్దేశ్యంలో అల్లు అరవింద్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

 Allu Aravindh Aha Trivikram - Telugu Plan To Web Series With Star Heros Cinimas Streeming

త్రివిక్రమ్‌ పేరుతో అయిన ఆహాకు మంచి పబ్లిసిటీ వస్తుందనేది ఆయన నమ్మకంగా తెలుస్తోంది.

అల్లు అరవింద్‌ ప్రస్తుతం ఆహాపై కోట్లాది రూపాయలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు.ఆదాయం ఇప్పుడు రాకున్నా భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా మంచి ఆదాయం వస్తుందనే నమ్మకంతో అల్లు వారి పెట్టుబడికి అడ్డు అదుపు లేకుండా ఉందని అంటున్నారు.త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 10 ఎపిసోడ్‌ల వెబ్‌ సిరీస్‌ను దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతో నిర్మించేందుకు రెడీ అవుతున్నారట.

మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..