అల్లు అరవింద్‌ కన్నీరు పెట్టుకున్న సందర్బం  

Allu Aravind Cries In Audio Function-audio Function,chiranjeei,pawan Kalyan,sye Raa Narasimha Reddy,varun Tej

గత రెండు సంవత్సరాలుగా మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిన్న రాత్రి నిర్వహించారు.రికార్డు స్థాయిలో జనాలు ఈ వేడుకలో పాల్గొన్నారు.దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న అల్లు అరవింద్‌ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు.ఇలాంటి అద్బుతమైన సినిమా చేసినందుకు చిరంజీవిని మరియు నిర్మించినందుకు రామ్‌ చరణ్‌ను అభినందిస్తూ అల్లు అరవింద్‌ మాట్లాడాడు.

Allu Aravind Cries In Audio Function-audio Function,chiranjeei,pawan Kalyan,sye Raa Narasimha Reddy,varun Tej-Allu Aravind Cries In Audio Function-Audio Function Chiranjeei Pawan Kalyan Sye Raa Narasimha Reddy Varun Tej

Allu Aravind Cries In Audio Function-audio Function,chiranjeei,pawan Kalyan,sye Raa Narasimha Reddy,varun Tej-Allu Aravind Cries In Audio Function-Audio Function Chiranjeei Pawan Kalyan Sye Raa Narasimha Reddy Varun Tej

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.సైరా చిత్రానికి నేనే మొదటి ప్రేక్షకుడిని.ఇటీవలే ఈ చిత్రంను చూశాను.సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారిని హత్తుకున్నాను.ఆయన చేసిన ఈ చిత్రం ఒక గొప్ప అద్బుతం అన్నాను.ఇక రామ్‌ చరణ్‌ను చూస్తే నాకు అసూయ కలిగింది.ఇంత చిన్న వయస్సులోనే ఇంత గొప్ప సినిమా నిర్మాణం చేసే అదృష్టం ఆయనకు దక్కింది.

ఆ సమయంలో నాకు కన్నీళ్లు వచ్చాయంటూ అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు.తప్పకుండా ఇదో గొప్ప సినిమాగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు.

ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి ఇంకా పలువురు స్టార్స్‌ నటించారు.హీరోయిన్స్‌గా నయనతార మరియు తమన్నాలు నటించారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ఒక సైనికురాలిగా మెగా డాటర్‌ నిహారిక కూడా కనిపించబోతుంది.అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్బంగా విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఖచ్చితంగా బాహుబలి 1 రికార్డులను బ్రేక్‌ చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ చిత్రం ఫలితం ఏంటీ అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.