ఆశకు పోయి నష్టం వచ్చిందా?.. అల్లు అరవింద్ కు రూ.40 కోట్లు నష్టం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా ఈ సినిమా హిందీ వర్షన్ లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు విపరీతమైన మార్కెట్ ఏర్పడింది.

 Allu Aravind Will Lose 40 Crore Kartik Aaryan Walk Out Shehzada, Allu Aravind, K-TeluguStop.com

దీంతో తెలుగులో అల్లు అర్జున్ నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే పుష్ప సినిమా హిందీ హక్కులను కొనుగోలు చేసిన గోల్డ్​మైన్స్​ మనీష్​ షా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని భావించారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత విరమించుకున్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ తెలుగు అలా వైకుంఠపురం సినిమా హిందీ రీమేక్ లో షెహజాదే పేరుతో నిర్మిస్తున్నారు.

ఇలా హిందీలో డబ్ చేయడం హిందీలో రీమేక్ చేయడం వల్ల ఇద్దరు నిర్మాతలు నష్టపోతారు కనుక ఇద్దరు నిర్మాతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గోల్డ్​మైన్స్​ మనీష్​ షా, హిందీ డబ్బింగ్ కోసం రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే తనకు సుమారు 20 కోట్ల వరకు లాభం వస్తుందని ఆయన భావిస్తున్నారు.

Telugu Allu Aravind, Karthika Aaryan, Shehzada, Tollywood-Movie

కానీ ఈ సినిమాని హిందీ షెహజాదే పేరుతో నిర్మిస్తున్న వారిలో నిర్మాత అల్లు అరవింద్ కూడా ఒకరు.ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అరవింద్ 40 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది.ఇక ఇందులో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నారు.

తన సినిమాని డబ్ చేసి విడుదల చేస్తే తనకు 20 కోట్లు లాభం వచ్చినప్పటికీ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్ కు 40 కోట్ల నష్టం వస్తుందని భావించిన మనీష్ షా తను 40కోట్లు నష్టపోవడం ఇష్టం లేదని అందుకే తన సినిమాని కేవలం దదించాక్ టీవీలో మాత్రమే ప్రసారం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube