‘పలాస 1978’ చూసి అల్లు అరవింద్‌ ఏం చేశాడో తెలుసా?  

Allu Aravind Watch Palasa Movie And Appreciate The Team Unit - Telugu Allu Aravind, Geetha Arts Banner, Palasa Director Karana Kumar, Palasa Premier Show, Palasa1978

మార్చి నెలలో పెద్ద సినిమాలు విడుదల ఉండదు.అందుకే ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు చిన్న సినిమాలు వరుసగా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతున్నాయి.

Allu Aravind Watch Palasa Movie And Appreciate The Team Unit

త్వరలో పలాస 1978 అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా గురించి మొదటి నుండి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది.

సినిమా కాన్సెప్ట్‌ చాలా విభిన్నంగా ఉంటుందని నిర్మాతలు మరియు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీమియర్‌ వేయడం జరిగింది.ప్రీమియర్‌కు హాజరు అయిన అల్లు అరవింద్‌ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.తప్పకుండా సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడట.అలాగే పలాస చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ను అభినందించాడు.సినిమాను నడిపించిన తీరు చాలా బాగుందని అభినందించాడట.ఇదే సమయంలో తమ బ్యానర్‌లో ఒక సినిమా చేయాలంటూ దర్శకుడితో అన్నాడట.

కరుణ కుమార్‌ డైరెక్షన్‌ పనితనం చాలా బాగుంది అంటూ అభినందించడంతో పాటు తమ గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో ఒక సినిమా చేసే అవకాశం ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగి పోతున్నాయి.పలాసా చిత్రం గురించి ఇప్పటి వరకు ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రమే టాక్‌ ఉంది.ఇప్పుడు ప్రేక్షకుల్లో కూడా సినిమా గురించిన చర్చ మొదలైంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Aravind Watch Palasa Movie And Appreciate The Team Unit Related Telugu News,Photos/Pics,Images..

footer-test