సూర్య, ఆసిన్ జంటగా 2005వ సంవత్సరంలో వచ్చిన “గజిని” సినిమా బ్లాక్ బస్టర్ మూవీ గా పేరు తెచ్చుకుంది.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న గజిని సినిమా తెలుగులో కూడా సంచలన విజయాన్ని దక్కించుకుంది.
డబ్బింగ్ సినిమాతో సూర్య తెలుగులో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు.మురుగదాస్ తమిళం మరియు తెలుగులో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు.
తెలుగులో గజిని సినిమాను డబ్బింగ్ చేసిన అల్లు అరవింద్ అదే టైటిల్ తో సినిమాను బాలీవుడ్ కు తీసుకు వెళ్ళాడు.
బాలీవుడ్ లో గజిని సంచాల విజయాన్ని సొంతం చేసుకోవడంతో అల్లు అరవింద్ కు ఏకంగా 100 కోట్ల లాభాలు వచ్చాయి.ఆ సినిమా తర్వాత బాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారింది.సినిమా లు అక్కడ వంద కోట్లు వరుసగా సాధించాయి.
బాలీవుడ్ లో గజిని సినిమా నిలిచి పోయే సినిమా అయ్యింది.తమిళం, తెలుగు, హిందీ ల్లో భారీగా వసూళ్లను రాబట్టిన గజిని సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.
గజిని 2 సినిమా అతి త్వరలోనే రాబోతుంది.
అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ లో గజిని 2 సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు.మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందా లేదంటే మరెవ్వరైన దర్శకత్వం వహిస్తారా అనేది తెలియాలి.ఇక హీరోగా మొదటి పార్ట్ లో ఇక్కడ సూర్య, అక్కడ అమీర్ ఖాన్ నటించారు.
మరి గజిని 2 లో ఎవరు నటిస్తారో చూడాలి.మొత్తానికి గజిని 2 టైటిల్ రిజిస్టర్ చేయించడంతో సినీ అభిమానులు సంతోషంతో ఉన్నారు.