మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు.ఒక సినిమా చూడగానే అది హిట్టా ఫట్టా అన్నది ఇట్టే చెప్పగల అనుభవం ఆయనకు ఉంది.
ఆడియెన్స్ కి రీచ్ అయ్యే సబ్జెక్ట్ సినిమాలో ఉందా లేదా అన్నది ఆయన చూసి చెప్పేయగలరు.ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ గని సినిమా విషయంలో కూడా అల్లు అరవింద్ ప్రెడిక్షన్ నిజమైందని అంటున్నారు.
సినిమాని అల్లు అరవింద్ పెద్ద అబ్బాయి అల్లు బాబి నిర్మించారు.ఈ సినిమా కథ విన్నప్పుడే రొటీన్ గా అనిపించిందట.
అంతేకాదు సినిమా చూశాక కొన్ని మార్పులు సూచించారట.కొత్త దర్శకుడి మీద నమ్మకం ఉంచి అలా లాగించేశారు.
ఫైనల్ గా వరుణ్ తేజ్ గని ఆశించిన స్థాయిలో అంచనాలను అంద్దుకోలేదు.
వరుణ్ తేజ్ వరకు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు కానీ రిజల్ట్ మాత్రం అతన్ని శాటిస్ఫై చేయలేదు.
కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో తెరకెక్కిన గని సినిమాలో బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా హెల్ప్ చేయలేకపోయింది.
బాక్సింగ్ కథని సెంటిమెంట్, ఎమోషనల్ మేళవించి సినిమా చేయగా సినిమా ఆడియెన్స్ ని మెప్పించడంలో విఫలమైంది.