ఆహ వెబ్ సిరీస్ కోసం కాజల్ కి రెండు కోట్లపైనే ఆఫర్ చేసిన అల్లు అరవింద్

తెలుగులో నెంబర్ ఒటీటీ ప్లాట్ ఫామ్ గా ఆహ దూసుకుపోతుంది.ఓ వైపు చిన్న సినిమాలని కోనేస్తూ ఒటీటీలో రిలీజ్ చేసి వినోదాన్ని అందించడంతో పాటు మలయాళీ మూవీస్ ని కూడా తెలుగులోడబ్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది.

 Allu Aravind Offers To Huge Remuneration To Kajal For Aha, Tamannaah, Tollywood,-TeluguStop.com

అలాగే వెబ్ సిరీస్ లని కూడా కొత్తదనం ఉన్న కథలతో ఎంకరేజ్ చేస్తూ డిజిటల్ ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం అహ చేస్తుంది.ఇక నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆహ చానల్ కోసం భాగానే పెట్టుబడులు పెడుతున్నారు.

ఇక దాని నుంచి రాబడి కూడా భాగానే ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఏకంగా తమన్నాతో 11 అవర్ అనే వెబ్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నాకి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు మరో వెబ్ సిరీస్ అలాగే టాక్ షోని కూడా తమన్నాతో ఆహ కోసం ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ని కూడా అల్లు అరవింద్ ఓ వెబ్ సిరీస్ కోసం ఫైనల్ చేసినట్లు సమాచారం.భారీ బడ్జెట్ తో ఓ డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కాజల్ లీడ్ రోల్ లో వెబ్ సిరీస్ ని సిద్ధం చేసినట్లు టాక్.

ఇక దీనికోసం కాజల్ అగర్వాల్ కి తమన్నా కంటే ఎక్కువగా రెండు కోట్ల పైనే రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారని తెలుస్తుంది.త్వరలో దీనికిసంబందించిన అఫీషియల్ కన్ఫర్మ్ కూడా రానుందని బోగట్టా.

ఇప్పటికే కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.ఇప్పుడు సెకండ్ వెబ్ సిరీస్ లో ఆహలోనే చేయనున్నట్లు సమాచారం .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube