రామాయణం కోసం తెలుగు దర్శకులపై ఆసక్తి చూపించని అల్లు అరవింద్  

రామాయణం ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తున్న అల్లు అరవింద్. .

Allu Aravind Not Interested On Tollywood Directors For Ramayan Series-

గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో టాప్ బ్యానర్ లలో ఒకటి.అలాంటి బ్యానర్ లో సినిమా అంటే దాని మీద అంచనాలు కూడా భారీగానే ఉంటాయి.

Allu Aravind Not Interested On Tollywood Directors For Ramayan Series--Allu Aravind Not Interested On Tollywood Directors For Ramayan Series-

దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి సినిమా తీసిన తర్వాత దాని స్ఫూర్తిగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామాయణం ఇతివృత్తాన్ని త్రీడీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసాడు.దీనికి రంగం కూడా సిద్ధం చేసాడు.అల్లు అరవింద్ తో పాటు ఈ సినిమాని మధు మంతెన, నమిత మల్హోత్రా నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు.

ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని మూడు భాగాలుగా ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బాహుబలితో భారీ బడ్జెట్ చిత్రాలని పరిచయం చేసింది తెలుగు దర్శకులు.ఇప్పుడు ఇండియాలో ఏకంగా సాహో, సైరా, జాను, ఆర్ఆర్ఆర్ లాంటి నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు తెలుగు దర్శకులే తెరకెక్కిస్తున్నారు.

అయితే రామాయణం సినిమా కోసం నిర్మాత అల్లు అరవింద్ తెలుగు దర్శకులలో ఎవరిని నమ్మకపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ రామాయణం సిరిస్ కోసం బాలీవుడ్ దర్శకులు అయిన దంగల్ దర్శకుడు నితీష్ తివారి, మామ్ దర్శకుడు రవి ని తీసుకున్నారు.

వీరితోనే స్క్రిప్ట్ వర్క్ చేస్యిస్తున్నారు.అయితే తెలుగులో స్టార్ దర్శకులని పక్కన పెట్టి అల్లు అరవింద్ బాలీవుడ్ దర్శకులపై మోజు పడటానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.