పేపర్‌బాయ్‌.. పై అంచనాలు పెంచేసిన అల్లు అరవింద్‌  

Allu Aravind Hikes Expectations On Paperboy-

సంతోష్‌ శోభన్‌ హీరోగా తెరకెక్కిన ‘పేపర్‌బాయ్‌’ చిత్రంపై నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు.అసలు సినిమా గురించి ఎక్కవ శాతం ప్రేక్షకులకు తెలియదు.కాని ఈ చిత్రం గురించి ఓవర్‌ నైట్‌లోనే అంచనాలు తారుమారు అయ్యాయి..

Allu Aravind Hikes Expectations On Paperboy--Allu Aravind Hikes Expectations On Paperboy-

పేపర్‌బాయ్‌ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు అల్లు అరవింద్‌ మొత్తం రైట్స్‌ను దక్కించుకున్నాడు.తెలుగు రాష్ట్రాల హక్కులు హోల్‌సేల్‌గా అల్లు అరవింద్‌ కొనడంతో ఈ చిత్రంపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో చెప్పకనే చెప్పొచ్చు.

దర్శకుడు శోభన్‌తో వర్క్‌ చేసిన అనుబంధంతో మహేష్‌బాబు మరియు ప్రభాస్‌లు ఆయన కొడుకు అయిన సంతోష్‌ నటించిన ఈ చిత్రానికి ప్రమోషన్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే వీరిద్దరు పేపర్‌బాయ్‌ చిత్రం సక్సెస్‌ కావాలని కోరుకుంటూ విషెష్‌ చెప్పారు.

త్వరలోనే వీరిద్దరు మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.దాంతో పాటు తాజాగా అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన కారణంగా ఒక్కసారిగా బయ్యర్ల దృష్టిని ఈ చిత్రం ఆకర్షిస్తుంది..

సంతోష్‌ శోభన్‌కు జోడీగా ఈ చిత్రంలో రియా సుమన్‌, తాన్య హోప్‌లు హీరోయిన్స్‌గా నటించారు.

జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సంపత్‌ నంది నిర్మించాడు.రచ్చ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న సంపత్‌ నంది నిర్మాణంలో తెరకెక్కడంతో ఆసక్తి నెలకొంది.తాజాగా అల్లు అరవింద్‌ చేయి కూడా పడటంతో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు.

మొదట ఈ చిత్రాన్ని వచ్చే నెల 7న విడుదల చేయాలని భావించారు.కాని అనూహ్య కారణాల వల్ల ఈ చిత్రం ఈ చిత్రంను ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సేఫ్‌ జోన్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

అల్లు అరవింద్‌ తీసుకున్న సినిమా అంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్‌ ఉంటుంది.అందుకే ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని అన్ని వర్గాల ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.