విశ్వక్ సేన్, ఆ ఛానల్ మధ్య గొడవను ప్రముఖ నిర్మాత సెటిల్ చేశారా.. ఏమైందంటే?

కొన్ని రోజుల క్రితం ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ కు విశ్వక్ సేన్ కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.ఈ గొడవ విషయంలో ఎక్కువ మంది టీవీ ఛానల్ నిర్వాహకులదే తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

 Allu Aravind Compromised Vishwak Sen Tv9 Issue Details Here Allu Aravind , Vishwak Sen , Tv9 Issue, Tollywood , Ashokavanamlo Arjuna Kalyanam-TeluguStop.com

ఈ గొడవ వల్ల సదరు టీవీ ఛానల్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.సినీ ప్రముఖులు సైతం ఈ గొడవ విషయంలో కలుగజేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు.

కొందరు సినీ ప్రముఖులు విశ్వక్ సేన్ కు మద్దతు ప్రకటించినా సదరు ఛానల్ కు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడలేదు.అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ విశ్వక్ సేన్ కు ఆ ఛానల్ కు మధ్య జరిగిన గొడవను సెటిల్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

 Allu Aravind Compromised Vishwak Sen Tv9 Issue Details Here Allu Aravind , Vishwak Sen , Tv9 Issue, Tollywood , Ashokavanamlo Arjuna Kalyanam-విశ్వక్ సేన్, ఆ ఛానల్ మధ్య గొడవను ప్రముఖ నిర్మాత సెటిల్ చేశారా.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ గొడవ వల్ల అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు భారీస్థాయిలో పబ్లిసిటీ జరగడంతో పాటు సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

అయితే న్యూస్ ఛానల్ తో గొడవ హీరోకు మంచిది కాదు.అదే సమయంలో హీరోలతో విభేదాల వల్ల ఛానల్ పాపులారిటీపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది.అయితే అల్లు అరవింద్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని నచ్చజెప్పారని తెలుస్తోంది.

అల్లు అరవింద్ ఈ విధంగా చేసి మంచి పని చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రాబోయే రోజుల్లో ఛానల్ లో విశ్వక్ సేన్ కనిపించినా ఆశ్చర్యానికి గురి కానవసరం లేదు.

మరోవైపు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సెకండ్ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ వీకెండ్ నాటికి అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube