ఆ కారణం వల్లే నేను నటుడిగా కొనసాగలేదు.. అర్హ అలా చేస్తుందంటూ?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అల్లు అరవింద్ నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Allu Aravind Comments About Allu Arha Details Here Goes Viral,allu Aravind Comm-TeluguStop.com

అలీతో సరదాగా షోకు అల్లు అరవింద్ మెరుపులా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు.కొడుకుగా నేను 22 సినిమాల్లో యాక్ట్ చేశానని మీరు పెద్ద కొడుకు అయితే నేను రెండో కొడుకు అని అలీ కామెంట్ చేయగా అలీ ఆస్తిలో వాటా ఏం అడగట్లేదు కదా అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశారు.

నాన్న అల్లు రామలింగయ్య గారు పదో తరగతి పూర్తి చేసి ఉండరు అని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.అమ్మగారి వయస్సు 92 సంవత్సరాలు అని అమ్మకు ఇష్టం కాబట్టే మొన్న స్టేజ్ మీదకు తీసుకొచ్చామని అల్లు అరవింద్ అన్నారు.

నిర్మల గారు ఎలా ఉన్నారనే ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ నిర్మల గారు చిదానందం అని అన్నారు.నిర్మల ఎక్కువ ప్రశ్నించదు అని ఎక్కువ హింసించదు అని అల్లు అరవింద్ తెలిపారు.

మనవడు, మనవరాలు గురించి చెప్పాలని కోరగా చిన్నప్పటి నుంచి వాళ్లను మీడియాలో మీరు చూస్తున్నారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.అర్హ మాత్రం బాబోయ్ అని అల్లు అరవింద్ కామెంట్ చేశారు.

ఎంత తెలివైందంటే అంత చిన్న వయస్సులో ఆ స్థాయిలో తెలివి ఉండటం అరుదు అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.నా మనవరాలు కాబట్టి అంతకు మించి చెప్పకూడదు అని అల్లు అరవింద్ కామెంట్ చేశారు.

మీ నాన్నగారు మిమ్మల్ని తెలివిగలవారు అనుకున్నారా అనే ప్రశ్నకు అనుకున్నారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.నేను ఎంప్లాయర్ కావాలనుకున్నానే తప్ప ఎంప్లాయ్ కావాలని అనుకోలేదని అందుకే నటుడిగా కొనసాగలేదని అల్లు అరవింద్ తెలిపారు.అల్లు అరవింద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube