అల్లు అరవింద్‌ సమయస్ఫూర్తి.. మరొకరైతే పెద్ద గొడవ అయ్యేది

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్‌ ఒకరు.అరుదుగా చిత్రాు నిర్మిస్తూ తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అరవింద్‌ ప్రస్తుతం సెకండ్‌ బ్యానర్‌ను ప్రారంభించి అందులో బన్నీ వాసుతో చిన్న చిత్రాలను నిర్మింపజేస్తున్నాడు.

 Allu Aravind Closed The Issue Of Geetha Govindam Song-TeluguStop.com

తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్‌గా పరుశురామ్‌ దర్శకత్వంలో ‘గీత గోవిందం’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ చిత్రంను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు.

చిన్న చిత్రమే అయిన ఈ చిత్రంపై అందరి దృష్టి పడేలా ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక పాటను విజయ్‌ దేవరకొండతో పాడిరచడం వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.

ఆ పాటకు యూత్‌ ఆడియన్స్‌ నుండి విపరీతమైన క్రేజ్‌ దక్కింది.అయితే ఆ పాటలో ఉన్న కొన్ని పదాల వల్ల హిందూ మత పెద్దలు మరియు మహిళ సంఘాల వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయి.

సీత, రాముడి గురించి, ఆడవారి గురించి తక్కువ చేసి ఆ పాటలో ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వెంటనే చిత్ర యూనిట్‌ స్పందించి, ఆ పాటలో కించపర్చే విధంగా ఉన్న పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.వెంటనే ఆ హామీని నెరవేర్చుకోవడం కూడా జరిగింది.

చిత్రంకు సంబంధించినంత మేరకు ఆ వివాదం సినిమాపై ప్రభావం చూపించేది.పాట పూర్తిగా ప్రేక్షకుల్లోకి వెళ్లకుండానే వివాదం మొదలైంది, ఆ వివాదంపై చర్చ ప్రారంభం అయిన వెంటనే ఆ పదాలను తొలగించేందుకు సిద్దం అయిన కారణంగా పెద్ద వివాదం తప్పినట్లయ్యింది.వెంటనే రచయిత ఆ పదాల స్థానంలో వేరే పదాలను రాయడంకు ప్రధాన కారణం అల్లు అరవింద్‌ అంటూ సమాచారం అందుతుంది.వివాదం పెద్దది కాకుండానే ఆరంభంలోనే తుంచేయడంలో అల్లు అరవింద్‌ కీలకంగా వ్యవహరించాడు.

ఏం కాదులే అని అలాగే ఉండి ఉంటే పెద్ద గొడవ అయ్యేదని, అసలు సినిమాలో ఆ పాట లేకుండా విడుదల చేయవల్సి వచ్చేది, లేదంటే కోర్టుకు వెళ్తే సినిమా విడుదలపై స్టే వచ్చేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అల్లు అరవింద్‌ సమయస్ఫూర్తితో వ్యవహించి గొడవ పెద్దది కాకుండా చూశాడు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

ఇలాంటి వివాదాలకు చక్కగా ఫుల్‌స్టాప్‌ పెడతాడు అంటూ మొదటి నుండి కూడా అల్లు అరవింద్‌కు పేరుంది.తన సినిమా విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube