దండం పెట్టి మరీ అల్లు అరవింద్‌ తప్పించుకున్నాడు... మరింత కష్టాల్లో బోయపాటి  

యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ బోయపాటి శ్రీను పేరు తెచ్చుకున్నాడు. ఈయన మినిమం గ్యారెంటీ చిత్రాలను అందిస్తూ వచ్చాడు. అయితే తాజాగా ఆయన దురదృష్టమో ఏమో కాని రామ్‌ చరణ్‌తో తీసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అత్యంత దారుణమైన ఫ్లాప్‌ను చరణ్‌కు ఇచ్చాడు. యాక్షన్‌ పాళ్లు మరీ ఎక్కువ అయ్యాయి అంటూ విమర్శలు వచ్చాయి. దాంతో సోషల్‌ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో చరణ్‌కు కావాలని బోయపాటి ఫ్లాప్‌ ఇచ్చాడని కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ సమయంలో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ బోయపాటిపై చేస్తున్న విమర్శలు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం చిరంజీవి 152వ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాలి, ఆ సినిమాను అల్లు అరవింద్‌ నిర్మించాలి. అందుకు సంబంధించిన అడ్వాన్స్‌ను కూడా ఇచ్చేశాడు. అయితే చిరు 152వ చిత్రం కొరటాలకు మారడంతో 153వ చిత్రం బాధ్యతలు బోయపాటికి అప్పగించాలని అల్లు అరవింద్‌ భావించాడు. చిరంజీవి కోసం ఇప్పటికే రెండు మూడు స్టోరీలను ప్రిపేర్‌ చేయించాడు. కాని ఇప్పుడు బోయపాటికి షాక్‌ ఇచ్చేలా అల్లు అరవింద్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Allu Aravind Canceled His Project With Boyapati Srinu-Balakrishna Boyapati Srinu Chiru 153 Movie Vinaya Vidheya Rama Failure

Allu Aravind Canceled His Project With Boyapati Srinu

చిరంజీవితో సినిమా క్యాన్సిల్‌ చేసుకున్నా, అడ్వాన్స్‌ తిరిగి ఇవాల్సిందిగా సన్నిహితుల ద్వారా బోయపాటికి అల్లు అరవింద్‌ కబురు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణతో మూడవ సినిమాను చేసే పనిలో ఉన్న బోయపాటి, ఆ తర్వాత చిరంజీవి హీరోగా ఒక చిత్రాన్ని చేయాలని చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాని చిరంజీవి తో బోయపాటి మూవీ విషయంలో అల్లు అరవింద్‌ నిర్ణయం మార్చుకోవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక ఆగం అవుతున్నాడు. బాలయ్యతో మూవీ మళ్లీ సూపర్‌ హిట్‌ అయితే చిరంజీవి ఏమైనా ఛాన్స్‌ ఇచ్చేనో చూడాలి.