పెళ్లి విషయంలో పూజాహెగ్డే కి సలహా ఇచ్చిన అల్లు అరవింద్..!!  

గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా “అలా వైకుంఠపురం లో”.త్రివిక్రమ్ దర్శకత్వంలో దాదాపు కొన్ని సంవత్సరాలు లాంగ్ గ్యాప్ తీసుకుని బన్నీ నటించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డు మొత్తం పగలగొట్టింది.

TeluguStop.com - Allu Aravind Advice Pooja Hegde On Marriage

సరికొత్త రికార్డులు సృష్టించి బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే పాటలు సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీ లో ఏ సినిమా క్రియేట్ చేయని విధంగా రికార్డులు క్రియేట్ చేయడం తో.సినిమా కొద్దిపాటి పాజిటివ్ తరహాలో టాక్ రావడంతో భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి “అలా వైకుంఠపురం లో” రి యూనియన్ అనే ఫంక్షన్ ని సినిమా యూనిట్ నిర్వహించింది.

ఈ ఫంక్షన్ కి హీరో హీరోయిన్లు అదేవిధంగా డైరెక్టర్ మరియు నిర్మాతలు సినిమా యూనిట్ మొత్తం రావడం జరిగింది.

TeluguStop.com - పెళ్లి విషయంలో పూజాహెగ్డే కి సలహా ఇచ్చిన అల్లు అరవింద్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అధినేత అల్లు అరవింద్.“అలా వైకుంఠపురం లో” దమ్మున్న సినిమా అని, మర్చిపోలేను సినిమా అని చెప్పుకొచ్చారు.ఈ సినిమా హిట్ అయిన తర్వాత అందరికీ మంచి పేరు వచ్చిందని.

హీరోయిన్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ బాలీవుడ్ లో అవకాశాలు బాగా వస్తున్నట్లు నేను విన్నాను నువ్వు ఇక్కడే ఉండాలి అని కోరుకుంటున్నాను అని అల్లు అరవింద్ తెలిపారు.ఈ విషయంలో మాట తప్పకూడదు అని హైదరాబాదులో ఇల్లు ఎలా కోనుకుంటున్నవో.

అదే రీతిలో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నట్లు.అల్లు అరవింద్ సలహా ఇచ్చారు.

అలా అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అనేక అవకాశాలు వస్తాయని పూజా హెగ్డే ని చమత్కరించారు.మొత్తం మీద “అలా వైకుంఠపురం లో” ఊహించని విధంగా సినిమా విజయం సాధించడంతో అల్లుఅరవింద్ ఎంతగానో హర్షం వ్యక్తం చేశారు.

#Allu Aravind #AlluArvind #Trivikram #Puja Heghde #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు