వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చిందన్న వార్తలపై అల్లు అరవింద్‌ స్పందన

అల్లు అరవింద్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని వార్లు వస్తున్నాయి.అయితే కొందరు మాత్రం అల్లు అరవింద్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడ్డట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

 Allu Aravind About Corona Virus News , Allu Aravind, Covid Vaccine, Corona Virus-TeluguStop.com

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న అల్లు అరవింద్‌ కరోనా బారిన పడ్డ వార్తల వల్ల చాలా మందికి వ్యాక్సిన్ పై నమ్మకం పోయింది అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.ఈ సమయంలోనే అల్లు అరవింద్‌ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు.

ఆయన ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.అందులో అల్లు అరవింద్‌ తనకు కరోనా పాజిటివ్‌ అంటూ వస్తున్న వార్తలు నిజమే అని చెప్పాడు.

కాని వ్యాక్సిన్‌ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన విషయాన్ని మాత్రం ఖండించాడు.

కరోనా వ్యాక్సిన్‌ అనేది రెండు డోసులు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.

ఇప్పటి వరకు తాను కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు మాత్రమే తీసుకున్నాను.నాకు కరోనా రెండవ డోసు ఇంకా ఇవ్వలేదు.

మొదటి డోసు తీసుకున్న తర్వాత మేము ముగ్గురం స్నేహితులం ఊరు వెళ్లాం.అక్కడ ముగ్గురికి కూడా కరోనా వచ్చింది.

ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం ఏంటీ అంటే కరోనా నిర్థారణ అయిన ముగ్గురిలో నేను ఇంకో స్నేహితుడు మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నాం.అది కూడా మొదటి డోసు మాత్రమే.

మరో వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదు.వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తికి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.

కాని ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న మాకు మాత్రం లక్షణాలు మామూలుగా ఉన్నాయి.కనుక వ్యాక్సిన్ అనేది చాలా ప్రయోజనంగా ఉంది.

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా వచ్చినా చాలా తక్కువ ప్రభావం ఉంటుందని మేము ఇద్దరం ప్రధాన సాక్ష్యం అంటూ అల్లు అరవింద్‌ వీడియోలో పేర్కొన్నాడు.అల్లు అరవింద్‌ ఒకటి రెండు వారాల్లో కరోనా బారి నుండి పూర్తిగా కోలుకుంటాడని వైధ్యులు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube