బాహుబలి కంటే హై రేంజ్ లో 3D రామాయణ!  

బాహుబలి కంటే హై రేంజ్ లో 3d రామాయణ!-3d Ramayana Official Announcement,allu Aravind 3d Ramayana,telugu

హిస్టారికల్ సినిమాలను తెరకెక్కించాలి అంటే వర్కింగ్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వందల కోట్లతో సినిమాను నిర్మించడమంటే అంత సాధారణమైన విషయం కాదు. అయితే ఇప్పుడు బాహుబలి కంటే హై రేంజ్ లో బాలీవుడ్ బడా నిర్మాతలతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ రామాయణంను తెరకెక్కిస్తున్నారు..

బాహుబలి కంటే హై రేంజ్ లో 3D రామాయణ! -Allu Aravind 3D Ramayana Official Announcement

గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ గా సినిమాకు సంబందించి మొదటి అడుగు ఈ రోజే పడింది. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రామాయణం సినిమాను మూడు భాగాలుగా ఒకేసారి 3D ఫార్మాట్ లో తెరకెక్కించేందుకు బలమైన టీమ్ సిద్ధమైంది. మధు మంతెన – నమిత్ మల్హోత్రా కూడా అల్లు అరవింద్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దంగల్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నితీశ్ తివారి అలాగే మామ్ దర్శకుడు రవి ఉద్యావర్ ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఇంకా ఈ హిస్టారికల్ సినిమా కోసం నటీనటులను ఫిక్స్ చేయాల్సి ఉంది..

వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి 2021 నాటికీ ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.