రాష్ట్రపతి కి నిర్భయ దోషుల కుటుంబ సభ్యుల పిటీషన్, విషయమేంటంటే

2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన నిందితులకు శిక్షలు అమలు పరచడం లో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే మూడు సార్లు వారి ఉరిశిక్షలు రద్దు కాగా తాజాగా మరో ఎత్తుగడ మొదలుపెట్టారు.

 Allow Us Euthanasia December 16 Gang Rape Convicts Kin To President Kovind-TeluguStop.com

నిర్భయ దోషుల అన్ని పిటీషన్ లు ముగియడం తో ఇప్పుడు తాజాగా వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాసినట్లు తెలుస్తుంది.తమ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి అంటూ వారు రాష్ట్రపతి కి పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం.

ఇప్పటికే చట్టంలో ఉన్న లొసుగులు అన్నిటిని ఉపయోగించుకున్న నిర్భయ దోషులు ఇక ఎలాంటి ఆస్కారం లేకపోవడం తో ఇప్పుడు కుటుంబాల చేత పిటీషన్ లు దాఖలు చేయడం మొదలు పెట్టారు.ఇప్పటికే వారి ఉరిశిక్షలు మూడు సార్లు వాయిదా పడడం తో తాజాగా ఈ నెల 20 వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటలకు ఆ నలుగురు నిర్భయ దోషులను ఉరి తీయాలి అంటూ ఢిల్లీ లోని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే నలుగురు దోషులు పెట్టుకున్న క్షమాభిక్షలు కూడా రాష్ట్రపతి తిరస్కరించడం తో ఇప్పుడు వారు పిటీషన్ లు పెట్టుకోవడానికి కూడా ఏమి లేవు.దీనితో వారికి ఈ సారి ఉరిశిక్షలు ఖాయం అని అనుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడు నిర్భయ దోషుల కుటుంబాలు రాష్ట్రపతి కి పిటీషన్ లు పెట్టుకోవడం తో మరోసారి వారి ఉరిశిక్షల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ లేఖ రాసిన వారిలో నిందితుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, దోషుల పిల్లలు కూడా ఉన్నారు.మేమంతా కారుణ్య మరణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ని కోరుతున్నాం.

రాబోయే రోజుల్లో నిర్భయ వంటి ఘటనలు జరగకుడా నిలువరించవచ్చు.కోర్టు కూడా ఒకరి స్థానంలో 5గురిని ఉరితీయమంటూ ఆదేశాలివ్వాల్సిన పని కూడా ఉండదు.

మన దేశంలో పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని కూడా క్షమాభిక్ష ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి.ప్రతీకారమనేది అధికారానికి నిర్వచనం కాదని, క్షమించడంలో కూడా అధికారం ఉంటుంది అంటూ నిర్భయ దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

మరోపక్క ఇప్పటికే నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటీషన్లు అన్ని కూడా రిజెక్ట్ అవ్వడం తో కొద్దీ రోజుల క్రితం దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ మరోసారి రాష్ట్రపతి కి క్షమాభిక్ష పిటీషన్ పెట్టినట్లు తెలుస్తుంది.గతంలో తన క్షమాభిక్ష పిటిషన్‌లో పూర్తి వివరాలను అటాచ్ చేయలేదని.

అందుకే అప్పుడు రిజెక్ట్ అయ్యిందని అందుకే ఇప్పుడు మరోసారి పిటీషన్ పెట్టుకున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.ఢిల్లీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ దోషులు వేసిన పలు పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube