వైరల్ వీడియో.. పక్షి అనుకుని డ్రోన్ ను మింగేసిన మొసలి.. ఆ తర్వాత..!

సాధారణంగా మొసలి నీళ్లలో నివసించే జీవి అయినప్పటికీ, కొన్నిసార్లు బయట దర్శనమిస్తూ ఉంటుంది.అయితే నీటిలో ఉన్నప్పుడు దాని బలం మాములుగా కంటే ఎక్కువ ఉంటుంది.

 Alligator Goes Up In Smoke After Chomping Down A Drone, Sunder Pichai, Crocodile-TeluguStop.com

అలా నీళ్లల్లో ఉన్నప్పుడు ఆ మొసలి ఎవరి మీద అయినా ఎటాక్ చేస్తే ఇక వాళ్ళను కాపాడడం దాదాపు కష్టమే.అంత పట్టు ఉంటుంది దాని చేతుల్లో.

చూస్తూ చూస్తూనే మనుషులను అమాంతం నోటిలో వేసుకోగల సామర్థ్యం కలిగి అంటుంది.

అందుకే మొసలిని చుస్తే వారికైనా భయంగా ఉంటుంది.

మొసలి దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే దానికి ఆహారంగా మారడం ఖాయం.మొసలి ఎప్పుడు తెలివిగా ఉంటుంది.

తాజాగా ఒక మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియో చూస్తే ఒళ్ళంతా గూస్ బంప్స్ రావడం ఖాయం.

ఈ వీడియోలో మొసలి రెప్పపాటు కాలంలో వేటాడింది.అయితే అది వేటాడింది.జంతువులను కాదు.

మరి ఇంతకీ ఆ మొసలి దేనిని వేటాడింది అని అనుకుంటున్నారా.ఆ మొసలి పక్షి అనుకుని ఒక డ్రోన్ కెమెరాను వేటాడింది.డ్రోన్ కెమెరాలు వచ్చిన తర్వాత వాటిని అన్నిటికి వాటినే ఉపయోగిస్తున్నారు.

అలాగే జంతువులను దగ్గర నుండి వీడియోలు తీయడానికి కూడా ఈ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.ఇక్కడ వీడియోలో కూడా డ్రోన్ కెమెరా మొసలికి దగ్గరగా ఎగురుతుంది.

దీంతో ఆ మొసలి డ్రోన్ కెమెరాను చూసి పక్షి ఏమో అనుకుని లటుక్కున నోట్లో పెట్టేసుకుంది.ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ మొసలి నోట్లో నుండి పొగలు వాస్తు కనిపించాయి.ఈ వీడియోను సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ లో షేర్ చెయ్యగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ వీడియోను కాలిఫోర్నియాకు చెందిన డ్రోన్ వ్యవస్థాపకుడు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా దానిని సుందర్ పిచాయ్ రీ ట్వీట్ చేసాడు.

అయితే ఏఈ వీడియో చుసిన నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.ఇలా మూగజీవుల విషయంలో ఇలాంటి డ్రోన్ వాడకలను నిషేదించాలని వారు కోరుతున్నారు.

ఇలాంటి చర్యలు చాలా క్రూరమైనవి అని మరొక నెటిజెన్ ట్వీట్ చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube