జగన్ లండన్ టూర్ పై ఇన్ని విమర్శలేంటి...?

సుదీర్ఘ పాదయాత్ర చేసిన అనంతరం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలు చక్కబెట్టిన వైసీపీ అధినేత జగన్ ఫిబ్రవరి 14 వ తేదీన అమరావతిలో గృహప్రవేశాన్ని కూడా పెట్టుకున్నారు.అయితే… ఆ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… హాజరవుతున్నట్టు ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలోనే జగన్ – కేసీఆర్ బంధం పై టీడీపీ భారీ విమర్శలు చేసింది.అయితే అనుకోకుండా… ఆ కార్యక్రమం కాస్తా రద్దు అయ్యింది.అయితే ప్రస్తుతం జగన్ లండన్ లో ఉన్న తమ కుమార్తెలను చూసేందుకు వెళ్లారు.ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ చూస్తోంది.

 Allegations On Ys Jagan Landan Toor-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే… వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత.

అసలు ఎన్నికల ముందు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది బాబు వేస్తున్న ప్రశ్న.జగన్ తన హవాలా డబ్బు కోసమే లండన్ టూర్‌కు వెళ్లారని ఆరోపణలు గుప్పించారు.ఈరోజు ఉదయం పార్టీ నాయకులతో జగన్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో భాగంగా చంద్రబాబు ఈ విధమైన విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిన సమయంలో ….జగన్ ప్రశాంతంగా విదేశీ పర్యటనకు వెళ్లడం వెనుక ఏదో కుట్ర ఉంది అంటూ బాబు అనుమానం వ్యక్తం చేసాడు.

దీనిపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని బాబు చెప్పుకొచ్చారు.

పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసాయాల్సిన సమయంలో అవేవీ పట్టించుకోకుండా… అసలు ఎంతో కీలకమైన అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలను పట్టించుకోకుండా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ … ప్రశ్నించారు.బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిన్న రాజమహేంద్రవరంలో చెప్పినవన్నీ వట్టి అబద్ధాలేనని రాష్ట్రానికి నిధులు సక్రమంగా ఇవ్వకుండానే వేలు, లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.జగన్ పర్యటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

అంతే కాకుండా… జగన్ లండన్ పర్యటనపై ఇంకా అనేక అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి అంటూ తెలుగుతమ్ముళ్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube