అల వైకుంఠపురములో త్రివిక్రమ్ అలా కాపీ కొట్టాడట!  

Allegation On Trivikram For Copying Ala Vaikuntapuramuloo - Telugu Ala Vaikuntapuramuloo, Krishna, Telugu Movie News, Tollywood Gossips, Trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.

Allegation On Trivikram For Copying Ala Vaikuntapuramuloo

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

అయితే ఈ సినిమా కథను తన దగ్గర నుండి త్రివిక్రమ్ కాపీ కొట్టాడంటూ ఓ రైటర్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

గతంలో సుబ్బు అనే సినిమాకు కథను అందించిన రైటర్ కృష్ణ, 2005లోనే ఈ కథను రెడీ చేసినట్లు, దాన్ని త్రివిక్రమ్‌కు వినిపించినట్లు ఆయన తెలిపాడు.ఆరు నెలల క్రితం ఈ సినిమాను తెరకెక్కించేందుకు తనకు దర్శకుడిగా ఓ ఛాన్స్ వచ్చిందని ఆయన అన్నారు.

‘స్థానం మారినా స్థితి మారదు’ అనే టైటిల్‌ను కూడా ఈ సినిమాకు అనుకున్నట్లు తెలిపాడు.కాగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం తన కథకు దగ్గరగా ఉందనే వార్త తెలుసుకున్న ఆ నిర్మాత ప్రాజెక్టును క్యాన్సిల్ చేసినట్లు కృష్ణ తెలిపాడు.

ఇదే విషయంపై ఆయన త్రివిక్రమ్‌ను కలిసేందుకు వెళ్లగా కాపీ విషయంపై త్రివిక్రమ్ నోరు మెదపలేరని ఆయన అన్నారు.తనకు ఫిలిం ఛాంబర్ నుండి కూడా ఎలాంటి సహకారం అందడం లేదని సదరు రచయిత కృష్ణ అంటున్నారు.

మరి ఈ వివాదంపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

#Krishna #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allegation On Trivikram For Copying Ala Vaikuntapuramuloo Related Telugu News,Photos/Pics,Images..