నాంది పలికిన అల్లరోడు.. ఏదో ఉంది!  

Allari Naresh New Movie Titled Naandi-naandi,telugu Gossips,telugu Movie News

అల్లరి సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కామెడీ హీరో అల్లరి నరేష్ ఆ తరువాత ఎంత స్పీడుగా తన కెరీర్‌లో దూసుకెళ్లాడో అందరికీ తెలిసిందే.ఈ యంగ్ హీరో అతి తక్కువ సమయంలో 50 సినిమాలు చేసి తన సత్తా చాటుకున్నాడు.

Allari Naresh New Movie Titled Naandi-Naandi Telugu Gossips Telugu News

అయితే అల్లరోడు చేసే కామెడీ రొటీన్‌గా ఉండటంతో నరేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్యూర్లుగా మిగిలాయి.

దీంతో గతకొంత కాలంగా సినిమాలే చేయడం మానేసిన అల్లరి నరేష్, రీసెంట్‌గా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చాలా సీరియస్ పాత్రలో నటించి మెప్పించాడు.

ఇప్పుడు ఇదే పంథాను కొనసాగించాలని చూస్తున్నాడు.దీంతో తాజాగా ‘నాంది’ అనే సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అల్లరి నరేష్.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ఆడియెన్స్‌లలో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.అల్లరి నరేష్‌ను తలకిందులుగా వేలాడదీసి ఉన్న ఈ పోస్టర్‌లో గాయాలతో నరేష్ కనిపించాడు.ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉందని మనకు ఈ పోస్టర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో అల్లరోడు ఏం చేస్తాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

తాజా వార్తలు