గుర్తు పట్టలేకుండా మారిపోయిన తెలుగు హీరోయిన్..

సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం అష్టకష్టాలు పడి చివరికి ఎలాగోలా హీరోయిన్ లేదా హీరోగా అవకాశాలు దక్కించుకుని అనుకోకుండా తెరమరుగైన నటీనటులు చాలా మంది ఉన్నారు.కాగా ఇందులో తెలుగులో ప్రముఖ హీరో జగపతి బాబు హీరోగా నటించిన అల్లరి ప్రేమికుడు చిత్రంలో జోగేశ్వరి దేవి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటి “కాంచన్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Allari Premikudu Movie Heroin Kanchana Real Life And Cine Career-TeluguStop.com

కాగా మొదటగా కాంచన్ 1971వ సంవత్సరంలో “సీమ” అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

కానీ ఈ చిత్రం కనీసం విదులైనట్లు కూడా చాల మందికి తెలీదు.

 Allari Premikudu Movie Heroin Kanchana Real Life And Cine Career-గుర్తు పట్టలేకుండా మారిపోయిన తెలుగు హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో దాదాపుగా 10 సంవత్సరాల పాటు కాంచన్ సినిమా అవకాశాల కోసం నిరీక్షించింది.ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “సనం బేవఫా” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినప్పటికీ ఈ అమ్మడికి తగినంత గుర్తింపు మాత్రం రాలేదు.కానీ అవకాశాలు మాత్రం బాగానే తలుపు తట్టాయి.

ఈ క్రమంలో కాంచన్ కొంతమేర సినిమా కథల విషయంలో మరియు తన పాత్రల విషయంలో అవగాహన లోపించడంతో ఎక్కువ శాతం చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.దీంతో కాంచన్ కి హీరోయిన్ గా గుర్తింపు రాకపోవడంతో సినిమాలపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.

Telugu Allari Premikudu, Allari Premikudu Movie Heroin Kanchan Real Life And Cine Career, Japati Babu, Kanchan, Telugu Heroin, Tollywood-Movie

అయితే కాంచన్ తెలుగు, మలయాళం, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.తెలుగులో కాంచన్ హీరోయిన్ గా నటించిన లక్కీ ఛాన్స్, అల్లరి ప్రేమికుడు, ప్రేమ పుస్తకం, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడికి నిలకడ లేని కారణంగా పెద్దగా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.కాగా చివరగా 2002వ సంవత్సరంలో “గంగు బాయ్” అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇప్పటికే ఈ చిత్రం పట్టాలెక్కలేదు.

దీంతో ప్రస్తుతం కాంచన్ ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది.? అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

#AllariPremikudu #Kanchan #Japati Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు