ఇకపై కామెడీ లేదు ఓన్లీ కంటెంట్ అంటున్న అల్లరోడు

రాజేంద్రప్రసాద్ తర్వాత టాలీవుడ్ లో కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో అల్లరి నరేష్.తెలుగులో రాజేంద్రుడు లోటు పూడ్చలేనిది అయినా తన సినిమాలతో కొంత వరకు ఆ ప్రయత్నం అల్లరి నరేష్ చేశాడు.అలాగే కొన్ని సినిమాలతో మెప్పించాడు.అయితే పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించే కథలని దర్శకులు సిద్ధం చేయలేకపోవడంతో అతను పేరుకి కామెడీ సినిమాలు చేసినా అవి ఎందుకు కాకుండా పోయాయి.

 Allari Naresh Took A Sensational Decision And Says No To Comedy-TeluguStop.com

చాలా కాలంగా నరేష్ కి సోలోగా ఒక్క హిట్ కూడా పడలేదు.అతను నటిస్తున్న సినిమాలు ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే విధంగానే ఉన్నాయి తప్ప ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉండటం లేదు అనేది విమర్శకుల మాట.జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలు వచ్చేశాక కంటెంట్ బేస్ కామెడీని ఆడియన్స్ కోరుకుంటున్నారని అయితే అల్లరి నరేష్ సినిమాలు అవుట్ డేట్ కామెడీ తప్ప కంటెంట్ ఉండటం లేదు అనే మాట వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో కామెడీ హీరో ఇమేజ్ నుంచి అల్లరి నరేష్ బయటకి రావడం కోసం ఈ సారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

 Allari Naresh Took A Sensational Decision And Says No To Comedy-ఇకపై కామెడీ లేదు ఓన్లీ కంటెంట్ అంటున్న అల్లరోడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాంది సినిమాతో నిర్దోషి అయిన ఖైదీ పాత్రలో అల్లరి నరేష్ నటించాడు.ఇందులో ఎలాంటి కామెడీ టచ్ లేకుండా పూర్తి సీరియస్ గా నడిచే కథ అని ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా తెలియజేశారు.

ఈ నేపధ్యంలో మొదటి సారి అల్లరి నరేష్ సినిమా మీద కూడా ఒక హైప్ క్రియేట్ అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో అల్లరి నరేష్ సంచలన విషయాన్ని చెప్పాడు.

ఇకపై కామెడీ సినిమాలని పూర్తిగా తగ్గించేస్తా అని కేవలం కంటెంట్ ఉన్న సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు.అలాగే విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తానని చెప్పాడు.

మరి కామెడీని పక్కన పెట్టి కంటెంట్ సినిమాలు చేస్తానని చెప్పిన అల్లరి నరేష్ కోసం దర్శకులు ఇకపై కొత్త కథలు తయారు చేస్తారా అనేది వేచి చూడాలి.

#Comedy Movies #Allari Naresh #ContentBase

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు