వాటికి కూడా నాంది పలుకుతున్న హీరో  

Allari Naresh To Do Web Series, Allari Naresh, Naandhi, Web Series, Tollywood News - Telugu Allari Naresh, Naandhi, Tollywood News, Web Series

టాలీవుడ్‌లో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.కానీ వరుసగా ఫెయిల్యూర్‌లు ఎదురవడంతో ఈ హీరో క్రమంగా సినిమాలు తగ్గిస్తూ వచ్చాడు.

 Allari Naresh To Do Web Series

అయితే కేవలం హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ‘మహర్షి’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు.దీంతో ఈ హీరోకు మంచి గుర్తింపు తిరిగి లభించడంతో ఈయన వరుసగా అవే పాత్రలు చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఎవ్వరూ ఊహించనట్లుగా ‘నాంది’ అనే సీరియస్ మూవీలో హీరోగా నటిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

వాటికి కూడా నాంది పలుకుతున్న హీరో-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాతో హీరోగా మరోసారి తన ప్రతిభను చాటుకునేందుకు అల్లరి నరేష్ రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

ఇక ఇప్పుడు మంచి ఆదరణ దక్కించుకుంటున్న వెబ్ సిరీస్‌లలో నటించేందుకు అల్లరి నరేష్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అల్లరి నరేష్‌తో చర్చలు కూడా చేస్తోందట.

ఇక ఈ విధంగా సినిమాలే కాకుండా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలోయింగ్ క్రియేట్ చేస్తున్న వెబ్ సిరీస్‌లలోనూ తనదైన మార్క్ వేసుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు.మరి అల్లరి నరేష్ ఈ వెబ్ సిరీస్‌తో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.

మొత్తానికి ఈ హీరో కూడా వెబ్ సిరీస్‌లకు నాంది పలకడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక నాంది చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Naandhi #Allari Naresh #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allari Naresh To Do Web Series Related Telugu News,Photos/Pics,Images..