కామెడీని పక్కన పెడితేనే సక్సెస్... లెక్క సరిచేసుకునే పనిలో అల్లరోడు

సినిమా హీరోలకి సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా బూస్టింగ్ లా పని చేస్తుంది.ఒక సక్సెస్ వస్తే అది మరికొంత కాలం వారి కెరియర్ కి వారధిగా మారుతుంది.

 Allari Naresh Plan To Stop Routine Comedy Goner, Tollywood, South Cinema, Vijay-TeluguStop.com

అయితే సినిమా ఫెయిల్యూర్ అయినేది ఎంతటి హీరోలైనా క్రింద పడేస్తుంది.ఆ ఫ్లాప్ ల పరంపర అలాగే కొనసాగుతూ ఉంటే ఒకానొక సమయానికి వారి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి కూడా రావడం మానేస్తారు.

అలా లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కనుమరుగైన హీరోగా తరుణ్ మిగిలిపోయాడు.అలాగే వడ్డే నవీన్, అబ్బాస్, వేణు లాంటి హీరోలు కూడా కెరియర్ వరుసగా రెండు, మూడు సక్సెస్ లు చూసి తరువాత వరుస ఫ్లాప్ ల కారణంగా కెరియర్ ని పోగొట్టుకున్నవారే.

ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్ళని అయితే పేర్లు పెట్టి అయిన గుర్తుపెట్టుకుంటారు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారిని అయితే పూర్తిగా మరిచిపోతారు.

ఈవీవీ ఫ్యామిలీ నుంచి కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు అల్లరి నరేష్.రాజేంద్రప్రసాద్ తర్వాత టాలీవుడ్ లో కామెడీ చిత్రాలకి కేరాఫ్ గా మారిన అల్లరి నరేష్ గత ఎనిమిదేళ్ళ కాలంలో సక్సెస్ అనే మాటని పూర్తిగా మర్చిపోయాడు.

తనకి అలవాటైన కామెడీ జోనర్ లో సినిమాలు చేస్తున్న సరైన కథ, కథనం లేకపోవడం వలన ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లతో పూర్తిగా క్రింద పడిపోయాడు.అతని సినిమాలకి ఓపెనింగ్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

అయితే కామెడీ జోనర్ ని పక్కన పెట్టి ఫుల్ సీరియస్ సబ్జెక్టుతో నాంది సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

రెగ్యులర్ కమర్షియల్ జోనర్ కి భిన్నంగా కంటెంట్ ఎలివేషన్ తో పాటు నరేష్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఈ పాత్ర అతనికి సినీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు తీసుకొస్తుంది.ఈ సినిమాతో అల్లరోడికి పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది.

దీంతో ఇకపై రొటీన్ కామెడీ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టి నటుడుగా తన బలం నిరూపించుకునే విధంగా కంటెంట్ బేస్ కథలు మాత్రమే చేస్తానని నరేష్ మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు.ఇదే విషయాన్ని తాజాగా సక్సెస్ మీట్ లో కూడా అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube