సభకు నమస్కారం పెడుతున్న అల్లరోడు

పొలిటికల్ సెటైరికల్ సినిమాలకి తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.కేవలం తెలుగులోనే కాకుండా అన్ని బాషలలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 Allari Naresh New Movie Sabhaku Namaskaram, Tollywood, Director Satish, Mahesh K-TeluguStop.com

పొలిటికల్ కంటెంట్ అనగానే అందులో ఉండే అంశాలు నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ స్టొరీని తమకి రిలేట్ చేసుకొని చూస్తారు.ఈ కారణంగానే వాటికి మంచి ఆదరణ ఉంది.

ఇదిలా ఉంటే కామెడీ చిత్రాలతో కెరియర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అల్లరి నరేష్ నాంది సినిమాతో ట్రాక్ మార్చాడు.కథల ఎంపికల కేవలం వినోదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా బలమైన కథ, కథనాలు ఉన్న స్క్రిప్ట్ లని ఫైనల్ చేసుకునే పనిలో పడ్డాడు.

Telugu Allari Naresh, Satish, Mahesh Koneru, Naandi, Tollywood-Movie

ఈ నేపధ్యంలో తాజాగా నరేష్ నటించబోయే కొత్త సినిమాని తాజాగా టైటిల్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాతో సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.సభకు నమస్కారం అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇక పోస్టర్ లో వేదికపై మైక్ ముందు నిలబడి ప్రజలకి అభివాదం చేస్తున్న నరేష్ కనిపిస్తున్నాడు.

అలాగే అతని ఓ వైపు జేబులో నోట్ల కట్ట మరో వైపు జేబులో మందు సీసా ఉండటం విశేషం.దీనిని బట్టి ఈ కథతో దర్శకుడు ఏం చెప్పబోతున్నాడు అనేది అర్ధమవుతుంది.

పొలిటికల్ సెటైరికల్ గా కామెడీ టచ్ ఇస్తూనే సీరియస్ పాయింట్ ని ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తుంది.రాజకీయ నాయకుల ఇచే మందు బోటిల్ కి, డబ్బులకి అమ్ముడుపోయే ప్రజలని ఇందులో లక్ష్యంగా దర్శకుడు విమర్శలు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube