అల్లరి సీరియస్‌ 'నాంది'ని దక్కించుకున్న అల్లు, త్వరలో స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు

అల్లరి నరేష్‌ హీరోగా దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన సుడిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లరి నరేష్‌ కు సక్సెస్‌ అనేది లేదు.

 Allari Naresh Nandhi Movie Very Soon In Aha Ott-TeluguStop.com

అయినా కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్‌ కు ఎట్టకేలకు నాంది సినిమా తో సక్సెస్‌ దక్కింది.ఇన్నాళ్లు కామెడీ చేస్తూ సక్సెస్‌ కోసం ప్రయత్నించిన అల్లరోడు ఇప్పుడు సీరియస్‌ పాత్రతో మెప్పించే ప్రయత్నం చేశాడు.

ఆయన చేసిన ప్రయోగంను ప్రేక్షకులు ఆస్వాదించారు.సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉందంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

 Allari Naresh Nandhi Movie Very Soon In Aha Ott-అల్లరి సీరియస్‌ నాంది’ని దక్కించుకున్న అల్లు, త్వరలో స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లరోడు ఈ తరహా పాత్రలు సినిమా లు చేసేందుకు సరి పోతాడు అంటూ ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు.థియేటర్లలో ఇంకా సందడి చేస్తున్న నాంది సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు నాంది ఓటీటీ రైట్స్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాంది సినిమా ను ఆహా వారు కొనుగోలు చేయడం జరిగింది.

ఆహా లో ఈ సినిమా ను రెండు వారాల్లో స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉందట.నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్‌ చేసుకునే విధంగా అల్లు అరవింద్‌ ఒప్పందం చేసుకున్నాడని అంటున్నారు.

వరుసగా పెద్ద సినిమాలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో నాంది సినిమా ను కొనుగోలు చేసిన అల్లు అరవింద్ ఒక మంచి సమయం చూసి స్ట్రీమింగ్‌ చేయాలని భావిస్తున్నాడు.క్రాక్‌ సినిమా ను ఆహా లో స్ట్రీమింగ్‌ చేయడంతో పెద్ద ఎత్తున లాభం దక్కించుకున్న ఆహా వారు ఇప్పుడు నాంది సినిమా తో మరో సారి భారీ గా ఖాతా దారులను దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

స్ట్రీమింగ్ తేదీ ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా రైట్స్‌ ను అమెజాన్‌ తో పోటీ పడి మరీ ఆహా వారు కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తుంది.

#Aha OTT #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు