దిల్ రాజుది మామూలు తెలివి కాదు, రూ.3 కోట్లు పెట్టి వంద కోట్ల బిజినెస్‌

దిల్‌ రాజు సినిమా వ్యాపారంలో తల పిండి పోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన తెలివితో ఒక సాదారన డిస్ట్రిబ్యూటర్ నుండి ఈ రేంజ్ కు ఎదిగారు.

 Allari Naresh Nandhi Movie Remake Rights Dil Raju Hand , Allari Naresh, Dil Raju-TeluguStop.com

ఆయన ఎదుగుదల ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.ఆయన్ను ఫాలో అయ్యే వారు పదుల కొద్ది మంది ఉంటారు.

ఎలాంటి సినిమాలు తీసుకోవాలి, ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలనే విషయాలు దిల్ రాజును చూసి నేర్చుకోవాలంటూ నిర్మాతలకు ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.అలాంటి దిల్ రాజు తీసుకున్న మరో నిర్ణయంను ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభినందిస్తున్నారు.

అల్లరి నరేష్‌ హీరోగా నటించిన నాంది సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.సినిమా తో నరేష్‌ మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా ఉన్నా కూడా మంచి సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

నాంది సినిమాకు భాష తో సంబంధం లేదు.

అన్ని భాషల్లో కూడా సక్సెస్‌ అయ్యే యూనివర్శిల్ కాన్సెప్ట్‌ తో నాంది సినిమా తెరకెక్కింది.అందుకే ఆ సినిమాను నాలుగు భాషల్లో రీమేక్‌ చేసేందుకు దిల్‌ రాజు సిద్దం అయ్యాడు.

కేవలం మూడు కోట్ల రూపాయలకు ఈ సూపర్‌ హిట్‌ సినిమా నాలుగు భాషల రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకున్న దిల్‌ రాజు బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే చర్చలు మొదలు పెట్టాడు.ఇక తమిళం, కన్నడం మరియు మలయాళంలో కూడా ఈ సినిమా ను యంగ్ హీరోలతో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ నాలుగు భాషల సినిమాల విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.చిన్న బడ్జెట్‌ సినిమా రీమేక్‌ రైట్స్ ను కొనుగోలు చేసి వంద కోట్ల బిజినెస్ చేస్తున్న దిల్‌ రాజు తెలివే తెలివి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube