ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమా టీజర్..!

టాలీవుడ్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకుగా పరిచయమైన నరేష్ ఆ తర్వాత అనేక చిత్రాల్లో తనదైన హాస్యాన్ని పంచుతూ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు.ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 56 సినిమాలు తీసిన ఆయన తాజాగా తన 57వ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు.

 Allari Naresh Naandi Movie Teaser Released, Allari Naresh, Naandi Movie, Naandi Teaser Talk, Social Media, Satish Vegnsa, Allari Naresh Naandi-TeluguStop.com

ప్రతి సినిమాకి తనని తను మార్చుకుంటూ కొత్తదనానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాజాగా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లరినరేష్.నాంది అనే సినిమా టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఇదివరకు ఓ చిన్నపాటి టీజర్ ను విడుదల చేసిన చిత్ర బృందం మరోసారి బ్రీత్ ఆఫ్ నాంది పేరుతో సరికొత్త టీజర్ ను రిలీజ్ చేశారు.

 Allari Naresh Naandi Movie Teaser Released, Allari Naresh, Naandi Movie, Naandi Teaser Talk, Social Media, Satish Vegnsa, Allari Naresh Naandi-ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమా టీజర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

విడుదలైన టీజర్ లో అల్లరి నరేష్ ఓ బందీగా కనపడుతున్నాడు.ఈ టీజర్ లో ఆయన లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేస్తే గానీ భారతదేశానికి స్వాతంత్రం రాలేదని.

అలాగే 1300 ప్రాణాలు బలి తీసుకుంటే గాని ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదని చెబుతూనే.న్యాయం ఎప్పుడూ కూడా ప్రాణం పోయిన తర్వాతే వస్తుందని చెప్పుకొచ్చాడు.

అటువంటి న్యాయం కోసం తన ప్రాణం పోయినా పర్లేదు అంటూ తెలిపాడు.

టీజర్ లో అల్లరి నరేష్ చెప్పిన మాటలు వింటుంటే ఆ సినిమాపై మరింత ఆసక్తిని ప్రేక్షకులకు కలిగిస్తుంది.

నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి సతీష్ వేగ్నేశ సహ నిర్మాతగా ఉన్నారు.అలాగే విజయ్ కనకమేడల మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ ను చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube