ఇప్పటి వరకు బొమ్మ.. ఇకపై బొరుసు అంటోన్న అల్లరోడు!

టాలీవుడ్‌లో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుందని, ఇండస్ట్రీలో సరికొత్త కామెడీ జోనర్ మూవీలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అల్లరి నరేష్.వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో.

 Allari Naresh, Naandi, Maharshi-TeluguStop.com

కాగా వరుసగా ఒకేరకమైన కామెడీ సినిమాలతో రావడంతో ప్రేక్షకులు చాలా బోరింగ్‌గా ఫీల్ అయ్యారు.దీంతో వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలతో అల్లరి నరేష్ ట్రాక్ తప్పాడు.ఇటీవల మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, ఇప్పుడు సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.‘నాంది’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అల్లరి నరేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

నాంది చిత్రంతో తన రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని, ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అల్లరి నరేష్ ధీమా వ్యక్తం చేశాడు.మరి అల్లరి నరేష్ ఈ సినిమాతో ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తాడో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube