నాంది టీజర్ టాక్: పుట్టుకకు తొమ్మిది నెలలు.. న్యాయానికి ఎన్ని నెలలు?

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నాంది ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించిన తెలిసిందే.ఈ సినిమాను చాలా సీరియస్ మూవీగా తెరెకెక్కిస్తున్నారు.

 Allari Naresh Naandhi Teaser Talk, Allari Naresh, Naandhi, Naandi Teaser, Naandh-TeluguStop.com

ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.

ఇక జూన్ 30న అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నాంది చిత్ర టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఇక ఈ టీజర్ చలా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ టీజర్‌ను అదే పనిగా చూస్తున్నారు.

భారతదేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులు, దోషులుగా ఉన్న నిర్ధోషులు జైళ్లలో ఎలా మగ్గుతున్నారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు చిత్ర యూనిట్.ఓ సాధారణ వ్యక్తి తాను చేయని నేరంపై జైలుకెళ్తే, అతడికి ఎదురయ్యే పరిస్థితులను మన కళ్లకు కట్టినట్లు చూపెట్టే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం అల్లరి నరేష్ చాలా కష్టపడ్డాడు.ఏకంగా నగ్నంగా నటించేందుకు కూడా ఆయన వెనకాడలేదు.

‘మనిషి పుట్టేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుంది, మరి తనకు న్యాయం జరిగేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’ అనే డైలాగుతో యావత్ న్యాయ వ్యవస్థను ప్రశ్నించాడు ఈ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల.ఈ సినిమాలో న్యాయం కోసం ఎదురుచూసే ఖైదీ పాత్రలో అల్లరి నరేష్ జీవించాడు.

ఇక అల్లరి నరేష్‌ను కాపాడే లాయర్ పాత్రలో తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది.ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సతీష్ వేగ్నేశ నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube