నాందికి ముగింపు పలికిన అల్లరోడు!  

Allari Naresh Naandhi Movie Shooting Completed, Allari Naresh, Naandhi, Tollywood News, Varalaxmi Sarat Kumar - Telugu Allari Naresh, Naandhi, Tollywood News, Varalaxmi Sarat Kumar

టాలీవుడ్‌లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లరి నరేష్, ఆ తరువాత వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అవుతూ వచ్చాడు.ఇక వరుసగా సినిమాలు ఫేడవుట్ అవుతుండటంతో క్యారెక్టర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు.

TeluguStop.com - Allari Naresh Naandhi Movie Shooting Completed

ఈ క్రమంలోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో మహర్షి చిత్రంలో నటించి మెప్పించాడు.ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న నరేష్, ఆ తరువాత కూడా క్యారెక్టర్ పాత్రలు చేస్తాడని అందరూ అనుకున్నారు.

అయితే మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అల్లరోడు రెడీ అయ్యడు.ఈ క్రమంలో ‘నాంది’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమాను విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక సీరియస్ నోట్‌పై నడిచే ఈ సినిమాలో అల్లరి నరేష్ రిమాండ్‌లో ఉన్న ఖైదీ పాత్రలో నటిస్తున్నాడు.

TeluguStop.com - నాందికి ముగింపు పలికిన అల్లరోడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ పాత్రలో అల్లరి నరేష్ పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా అల్లరి నరేష్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలిపింది.ఈ సినిమాతో అల్లరి నరేష్ అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరి నాంది చిత్రంతో హీరోగా తిరిగి సక్సెస్ కొట్టడంలో అల్లరోడు విజయం సాధిస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

#Naandhi #VaralaxmiSarat #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allari Naresh Naandhi Movie Shooting Completed Related Telugu News,Photos/Pics,Images..