నాంది ప్రీ రిలీజ్ బిజినెస్ మరీ అంత తక్కువా..?- Allari Naresh Naandhi Movie Pre Release Business Details

allari naresh naandi movie pre release business details, allari naresh, naandi, pre release business, nizam rights, seeded, andhra rights, satellite and digital rights - Telugu 2.7 Crore Rupees, Allari Naresh, Andhra Rights, Naandhi Movie, Naandi, Nizam Rights, Pre Release Business, Satellite And Digital Rights, Seeded

ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.గత నెలలో నరేష్ హీరోగా తెరకెక్కి విడుదలైన బంగారు బుల్లోడు సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

 Allari Naresh Naandhi Movie Pre Release Business Details-TeluguStop.com

అయితే గతంలో గమ్యం, శంభో శివ శంభో సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్న నరేష్ మరోసారి నాంది సినిమాలో సీరియస్ రోల్ లో నటిస్తున్నారు.

నాంది సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అల్లరి నరేష్ ఈ సినిమా తనకు సక్సెస్ తో పాటు మార్కెట్ రేంజ్ ను పెంచుతుందని భావిస్తున్నారు.

 Allari Naresh Naandhi Movie Pre Release Business Details-నాంది ప్రీ రిలీజ్ బిజినెస్ మరీ అంత తక్కువా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హక్కులకు 8 కోట్ల రూపాయలకు ఆఫర్ వచ్చిందని ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుందని వార్తలు రాగా నరేష్ మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులివ్వడంతో థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడానికి ఆసక్తి చూపారు.

Telugu 2.7 Crore Rupees, Allari Naresh, Andhra Rights, Naandhi Movie, Naandi, Nizam Rights, Pre Release Business, Satellite And Digital Rights, Seeded-Movie

ఒక వర్గం ప్రేక్షకులు నాంది సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని 3 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తానికే ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం.నరేష్ 57వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుండగా నైజాం కోటి రూపాయలు, సీడెడ్ 30 లక్షలు, ఆంధ్రా హక్కులు కోటీ 20 లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం.

7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు డిమాండ్ బాగానే ఉన్నా సినిమా ఫలితాన్ని బట్టి శాటిలైట్, డిజిటల్ హక్కులను అమ్మాలని నాంది మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.నెటిజన్లు ఈ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్లు చేస్తుండగా అల్లరోడికి ఈ సినిమాతో హిట్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

#Seeded #Nizam Rights #SatelliteAnd #PreRelease #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు