నరేష్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఓటీటీలో నాంది ఎప్పుడంటే..?

కామెడీ సినిమాలతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అల్లరి నరేష్ కు ఈ మధ్య కాలంలో నటించిన కామెడీ సినిమాలన్నీ షాక్ ఇస్తున్నాయి.విడుదలకు ముందు సినిమాపై అంచనాలు పెరిగినా సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి.

 Allari Naresh Naandhi Movie Ott Release Date Fixed-TeluguStop.com

కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో విజయ్ కనకమేడల అనే కొత్త డైరెక్టర్ డైరెక్షనలో అల్లరి నరేష్ నాంది సినిమాలో సీరియస్ రోల్ లో నటించారు.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్లు బాగానే వచ్చాయి.

వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న అల్లరి నరేష్ కు నాంది రిజల్ట్ సంతోషాన్నిచ్చింది.ఈ సినిమా ఫలితం వల్ల నరేష్ భవిష్యత్తులో సీరియస్ రోల్స్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

 Allari Naresh Naandhi Movie Ott Release Date Fixed-నరేష్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఓటీటీలో నాంది ఎప్పుడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా ఓటీటీ కొనుగోలు చేసింది.ఆహాలో ఈ నెల 12వ తేదీ నుంచి నాంది స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం.

దాదాపు 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాలో ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఐపీసీ సెక్షన్ 211 గురించి ప్రధానంగా ప్రస్తావించారు.ఈ సినిమాకు సెలబ్రిటీల ప్రశంసలు సైతం దక్కాయి.

సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం అల్లరి నరేష్ శ్రమించగా సినిమా సక్సెస్ సాధించడంతో కష్టానికి తగిన ఫలితం దక్కింది.సినిమా ఫిబ్రవరి 19వ తేదీన విడుదల కాగా విడుదలైన 24 రోజులకు ఓటీటీలో అందుబాటులోకి రావడం గమనార్హం.

ఈ సినిమా ఆహాలో కూడా ఊహించని స్థాయిలో వ్యూస్ సాధిస్తుందని నరేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆహాలో విడుదలైన కలర్ ఫోటో, క్రాక్ సినిమాలకు వ్యూస్ భారీగా వచ్చిన సంగతి తెలిసిందే.

నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన విజయ్ కనకమేడల డైరెక్షన్ లోనే నరేష్ మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

#@varusarath5 #@SatishVegesna #@vijaykkrishna #AllariNaresh #@allarinaresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు