నాంది తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా..?- Allari Naresh Naandhi Movie First Day Collection Details

allari naresh naandhi movie first day collection details are here, allari naresh, naandhi, first day collections, 49 lakh rupees, positive talk, critics, full run, success - Telugu 49 Lakh Rupees, Allari Naresh, Critics, First Day Collections, Full Run, Naandhi Movie, Positive Talk, Success

ఎనిమిది సంవత్సరాలు సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కు నాంది సినిమా రూపంలో సక్సెస్ దక్కింది.అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఇప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన నరేష్ ఇలాంటి అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

 Allari Naresh Naandhi Movie First Day Collection Details-TeluguStop.com

అయితే ఈ సినిమాకు టాక్ కు తగిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం గమనార్హం.

నాంది సినిమా థియేట్రికల్ హక్కులు 2 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడవగా తొలిరోజు 49 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టడం గమనార్హం.

 Allari Naresh Naandhi Movie First Day Collection Details-నాంది తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫుల్ రన్ లో కనీసం మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తే నాంది సినిమా కమర్షియల్ గా కూడా హిట్ గా నిలుస్తుంది.ఈరోజు, రేపు నాంది మూవీ కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితంపై ఒక అంచనాకు రావచ్చు.

క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలను పొందిన నాంది నరేష్ కెరీర్ కు ప్లస్ అయిందనే చెప్పాలి.

Telugu 49 Lakh Rupees, Allari Naresh, Critics, First Day Collections, Full Run, Naandhi Movie, Positive Talk, Success-Movie

గత కొన్నేళ్లుగా రొటీన్ కామెడీ సినిమాలతో వరుస ఫ్లాపులు చవిచూసిన నరేష్ మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటించి సీరియస్ రోల్ లో మెప్పించారు.ఆ సినిమా తరువాత పూర్తిస్థాయి సీరియస్ రోల్ లో నాంది సినిమాలో నటించి మరో కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.నాంది సినిమా నైజాం ఏరియాలో 18 లక్షల రూపాయలు, సీడెడ్ లో 6 లక్షల రూపాయలు, మిగిలిన ఏరియాల్లో 23.5 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.

ఈ సినిమా తరువాత నరేష్ ఎలాంటి కథలను ఎంచుకుంటుంటారో చూడాల్సి ఉంది.

ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు 211 అనే సెక్షన్ ను ప్రేక్షకులకు నరేష్ పరిచయం చేశారు.ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

#Critics #Allari Naresh #49 Lakh Rupees #FirstDay #Success

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు